లేటెస్ట్

'ఆంధ్రా'లో 'రామోజీఫిల్మ్‌సిటీ'ని నిర్మిస్తారా...!?

'ఈనాడు' రామోజీరావు 'ఆంధ్రా'లో 'రామోజీఫిల్మ్‌సిటీ'ని నిర్మిస్తారని ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇప్పటికే కసరత్తు జరుగుతుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లాకు చెందిన 'రామోజీరావు' తన స్వంత ప్రాంతమైన 'కృష్ణా' జిల్లాలో 'రామోజీఫిల్మ్‌సిటీ-2'ను నిర్మించాలని ఆలోచిస్తున్నారని, దీని సాధ్యాసాధ్యలపై చర్చలు జరుగుతున్నా యంటున్నారు. హైదరాబాద్‌లో 'రామోజీఫిల్మ్‌సిటీ'ని ఆయన ఇప్పటికే నిర్మించి దానికి గిన్నిస్‌బుక్‌లో స్థానం కల్పించారు. దాదాపు 4వేల ఎకరాల్లో ఈ ఫిల్మ్‌సిటీ నెలకొని ఉంది. హైదరాబాద్‌కు ఆకర్షణగా నిలిచిన 'ఫిల్మ్‌సిటీ'లో పలు సినిమా షూటింగ్‌లు, హోటల్స్‌, షాపింగ్‌మాల్స్‌, కళ్యాణమండపాలు..పిల్లలకు పార్కులు తదితరాలతో పాటు..అన్ని సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్‌లో పేరు మోసిన టూరిస్టు ప్లేస్‌గా ఇది పేరొందింది. అయితే...ఇటువంటిదే...ఇప్పుడు 'ఆంధ్రా'లో నిర్మించాలని 'రామోజీ' తలపోస్తున్నారని ప్రచారం జరుగుతోంది. 

ఈ రోజు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైనప్పుడు ఈ అంశం చర్చకు వచ్చిందంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ టిడిపి ఘనవిజయం సాధిస్తుందని, 'చంద్రబాబు' ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఈ ప్రాజెక్టు ముందుకు వెళుతుందని వారు అంటున్నారు. 'ఈనాడు' సంస్థ అసెంబ్లీ ఎన్నికలపై సర్వే చేసిందని, ఈసర్వేలో మళ్లీ టిడిపి గెలుస్తుందని తేలిందని, దాంతో..దీని గురించి చర్చించారని అంటున్నారు. 'ఫిల్మ్‌సిటీ'కి అవసరమైన భూమిని ప్రభుత్వం సేకరించి ఇవ్వాలని 'రామోజీ' కోరుతున్నట్లు సమాచారం. ఒప్పుడు హైదరాబాద్‌లో చవకగా భూమి దొరకడంతో...'రామోజీ' భారీస్థాయిలో 'ఫిల్మ్‌సిటీ'ని నిర్మించగలిగారు. 'ఆంధ్రా'లో ఆపరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వమే భూసేకరణ చేయాల్సి ఉంటుంది. కృష్ణా జిల్లాలో అయితే ప్రాజెక్టు కోసం భూమిని సేకరించే పరిస్థితి లేదు. గుంటూరు జిల్లా దొనకొండ ప్రాంతంలో అయితే విస్తారంగా భూమి దొరుకుతుంది. దీంతో..ఈ ప్రాంతాన్ని పరిశీలించే అవకాశం ఉంది. మొత్తం మీద...'ఆంధ్రా'లో 'ఫిల్మ్‌సిటీ'ని నిర్మిస్తారని,అయితే ఎప్పుడు మొదలవుతుందనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా..'ఆంధ్రా'లో నిర్మించే 'ఫిల్మ్‌సిటీ' 'హైదరాబాద్‌'లో ఉన్నంత భారీగా ఉండదని అంటున్నారు. చూద్దాం..మరి ఏమి జరుగుతుందో..!?

(464)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ