WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సిరీస్‌ గెలిచిన భారత్‌...!

ఇంగ్లాండ్‌పై భారత్‌ సిరీస్‌ గెలిచింది. విరాట్‌కోహ్లీ,జయంత్‌ యాదవ్‌, అశ్విన్‌, విజయ్‌ ఇలా తలా ఓ చేయి వేసి ఇంగ్లీషు టీమ్‌ను మట్టి కరిపించారు భారత్‌ ఆటగాళ్లు. వాఖండేలో జరిగిన నాల్గవ టెస్టులో భారత్‌ ఇంగ్లాండ్‌ను ఇన్సింగ్స్‌ 36 పరుగుల తేడాతో ఓడించింది. తద్వారా ఐదు టెస్టుల సిరీస్‌ను మరో టెస్టు మిగిలి ఉండగానే 3-0తో గెల్చుకుంది. భారత్‌ గెలుపు నిన్ననే ఖాయయినా...సోమవారం బ్రిటీష్‌ బ్యాట్స్‌మెన్‌ ఎంతసేపు పోరాడతారో చూడాలని భారత్‌ అభిమానులు భావించారు. అయితే ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ ఎటువంటి పోరాటం చేయకుండానే చేతులు ఎత్తివేశారు. చివరకు 195 పరుగులకే ఆలౌట్‌ అయ్యారు. చివరి నాలుగు వికెట్లు 'అశ్విన్‌'కు దక్కడం విశేషం. మొత్తం మీద మొదటి ఇన్సింగ్స్‌లో 6 రెండవ ఇన్సింగ్స్‌లో 6తో కలిపి 'అశ్విన్‌' ఈ టెస్టులో 12 వికెట్లు సాధించాడు. అశ్విన్‌ పది వికెట్లు తీయడం అతని కెరీర్‌లో ఇది ఏడోసారి. డబుల్‌ సెంచరీ సాధించి భారత్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన కెప్టెన్‌ కోహ్లీకి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. 

    ముంబాయి టెస్టులో భారత్‌కు విజయం అంత సులువుగా ఏమీ లభించలేదు. తొలుత ఇంగ్లాండ్‌ జట్టు టాస్‌ గెలవడం మొదటి ఇన్సింగ్స్‌లో వారు 400 పరుగలు చేయడంతో భారత్‌పై తీవ్ర ఒత్తిడి నెలకొంది. అదీ కాక గతంలో ఇక్కడ గతంలో ఇంగ్లాండ్‌ ఆడిన రెండు టెస్టుల్లో విజయం వారి వరించడం కూడా భారత్‌కు ఇబ్బందులు సృష్టిస్తుందని క్రీడాభిమానులు భావించారు. వారు అనుకున్నట్లే భారత్‌ తొలి ఇన్సింగ్స్‌లో 364పరుగులకే 8 వికెట్లు కోల్పోయి తొలి ఇన్సింగ్స్‌లో ఇంగ్లాండ్‌కు ఆధిక్యం ఇస్తుందేమోననిపించింది. అయితే కెప్టెన్‌ కోహ్లీ, బౌలర్‌ జయంత్‌యాదవ్‌లు ఆంగ్లేయులకు చుక్కలు చూపించారు. ఇద్దరూ ఇంగ్లాండ్‌ బౌలర్లను చీల్చి చెండాడి భారత్‌కు భారీ స్కోరు అందించారు. ఈ క్రమంలో కెప్టెన్‌ కోహ్లీ డబుల్‌ సెంచరీ, జయంత్‌ సెంచరీలు సాధించారు. రికార్డు స్థాయిలో 9వ వికెట్‌కు 231 పరుగులు సాధించారు. దీంతో మ్యాచ్‌ బ్రిటీషర్స్‌ చేతి నుంచి భారత్‌ వైపుకు వచ్చింది. భారీ ఆధిక్యంతో భారత్‌ బౌలర్లు చెలరేగిపోయారు. ఐదవ రోజు 'అశ్విన్‌'ను ఎదుర్కోవడం వారి తరం కాలేకపోయింది. దీంతో కనీసం రెండు వందల మార్కును కూడా దాటకుండానే ఇంగ్లాండ్‌ ఇన్సింగ్స్‌ ఆలౌట్‌ అయింది.


(369)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ