లేటెస్ట్

'మీడియా నయీం' 'రవిప్రకాష్‌'...!

వైకాపా రాజ్యసభ సభ్యుడు 'విజయసాయిరెడ్డి' నోటి దురద అంత తేలిగ్గా తగ్గేలా లేదు. పలు అవినీతి, అక్రమాస్తుల కేసుల్లో ప్రతి శుక్రవారం కోర్టు గడప తొక్కి వస్తోన్న ఈ మాజీ ఆడిటర్‌ తన ప్రత్యర్థులపై ఒంటికాలిపై లేస్తున్నారు. తనకు గిట్టని రాజకీయ నాయకులను, మీడియా ప్రతినిధులను తిట్టిపోస్తున్నారు. తానేదో శుద్దపూస అయినట్లు శుద్దలు చెబుతున్నారు. మొన్నటికి మొన్న 'టివి9 రవిప్రకాష్‌'ను తిడుతూ..'కమ్మ'ని నీతులకు కాలం చెల్లిందన్న ఆయన ఈ రోజు మరింత రెచ్చిపోయారు. టివి9 మాజీ సిఈఓ 'రవిప్రకాష్‌'ను మాఫియా లీడర్‌ 'నయీం'తో పోల్చారు. ఈ మీడియా నయీంను ఏ'బాబు' రక్షిస్తాడో..అంటూ ఎద్దేవా చేశారు. పోలీసులు వస్తే ఇంట్లో కనిపించడు...నోటీసులకు స్పందించడు...పరారీలో లేనంటాడు...పోలీసులు, చట్టాలు, కోర్టులు తనంతటి 'ప్రవక్త'ను టచ్‌ చేయవన్న భ్రమలో ఉన్నాడు..బెయిల్‌ పిటీషన్‌ కోర్టు కొట్టేసింది..తప్పించుకునే దారులన్నీ లేకపోయిన ఈ మీడియా నయీంను ఏ 'బాబు' రక్షిస్తాడో చూడాలి..నిజం చెప్పులు తొడుక్కునే లోపు అబద్దం పరారైపోయింది. 'నకిలీ ప్రవక్త' రాత్రికి..రాత్రి దొడ్డి దారిలో గోడ దూకేసి బోర్డర్‌ దాటేశాడు...రేపో.. మాపో మాల్యాతో సెల్ఫీ దిగుతూ...కనిపించి పట్టుకోండి చూద్దాం..అంటాడేమోనని ఎద్దేవా చేశారు. కాగా 'విజయసాయిరెడ్డి' వ్యాఖ్యలపై కొందరు స్పందిస్తూ...ఆయనే వేలకోట్ల కుంభకోణాలకు సూత్రధారి... ఆడిటర్‌గా ఉండి..అడ్డగోలు రాతలు, తప్పుడు రాతలు రాసి 'జగన్‌'కు దోచిపెట్టి..ఆ కేసుల్లో కోర్టులు చుట్టూ తిరుగుతున్న వ్యక్తి...మరో వ్యక్తిపై వ్యాఖ్యలు చేయడం..విడ్డూరంగా ఉందంటున్నారు. 

(219)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ