WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అమలాపాల్‌'...దారిలో 'మీరాజాస్మిన్‌'...!

మరో సినీ జంట విడాకుల కోసం ధరఖాస్తు చేసుకుంది. సినీనటులు పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం మామూలే. మొన్న 'అమలాపాల్‌' నేడు 'మీరా జాస్మిన్‌' ఆ దారిలో నడుస్తున్నారు. 2014లో దుబాయ్‌కి చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ 'అనిల్‌'ను వివాహం చేసుకున్న 'మీరా జాస్మిన్‌'ను ఇప్పుడు ఆ బంధాన్ని తెంపుకోవడానికి తీవ్రంగా యత్నిస్తుంది. సినిమాల్లో నటించాలన్న తన కోరికను భర్తను కాదనడంతో ఆమె అతనికి విడాకులు ఇవ్వాలనుకుంటుందట. ఇటీవల ఆమె '10కల్పనకల్‌' అనే మలయాళ చిత్రంలో నటించారు. అంతే కాదు 'పూమరం' అనే మరో చిత్రంలోనూ నటిస్తున్నట్లు తెలుస్తోంది. దీనితో భార్యభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డా యట. ఆమె సినిమాల్లో నటించడం తనకు ఇష్టం లేదని...కానీ ఆమె సినిమాలే ప్రధాన మని చెప్పడంతో ఇద్దరూ కలసి చర్చించుకుని విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారట. గతంలోనే 'పెళ్లి' అయిన 'అనిల్‌'ను 'మీరా'ను రెండో వివాహం చేసుకున్నారు. ఈ సందర్భంగా మొదటి భార్య తరుపు వారు 'అనిల్‌'పై దాడి చేయడానికి ప్రయత్నించారు. పోలీసుల సహకారంతో అప్పుడు 'మీరాజాస్మిన్‌' వివాహం ఎటువంటి గొడవలు లేకుండా జరిగిపోయింది. అప్పట్లో అంత హడావుడిగా పెళ్లి చేసుకున్న ఈ జంట ఇప్పుడు విడాకులు తీసుకోవడం విశేషం...! ఇటీవల 'మహిళల'పై అత్యాచారాలు చేసే వారి అంగాలను కట్‌ చేయాలని 'మీరా జాస్మిన్‌' ప్రకటన చేసి సంచలనం సృష్టించింది.


(654)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ