WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'షకీలా' జీవితం ఆధారంగా సినిమా...!

ఇప్పుడు దేశ వ్యాప్తంగా బయోపిక్‌ల సీజన్‌ నడుస్తోంది. శృంగారతార 'షకీలా' జీవితచరిత్ర ఆధారంగా ఓ సినిమా వస్తోందట. గతంలో 'సిల్క్‌స్మిత' జీవితం ఆధారంగా తీసిన 'డర్టీ పిక్చర్‌'కు విపరీతమైన క్రేజ్‌ వచ్చింది. దీంతో ఇటువంటి శృంగారతారల జీవితాలపై సినిమాలు తీయడానికి నిర్మాతలు ముందుకు వస్తున్నారు. దీనిలో భాగంగా శృంగారతార 'షకీలా' జీవితం ఆధారం ఓ సినిమా తెరకెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. 'మల్లూ ఆంటీ' పదానికి విపరీతమైన పాపులారీటీ తెచ్చిన 'షకీలా' పాత్రను 'హ్యూమా ఖురేషీ'తో చేయించబోతున్నారని సమాచారం. కన్నడ దర్శకుడు ఇంద్రజిత్‌...ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారట. గతంలో అతను తీసిన 'లవ్‌యూ అలియా చిత్రంలో 'షకీలా'తో పాటు 'సన్నీలియోన్‌' కూడా నటించారు. కాగా ఈ చిత్రం కోసం 'హ్యూమా'ను ఫైనల్‌ చేశారట. గతంలో ఆమె చేసిన 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ వసీపూర్‌' చిత్రంతో బిజీగా మారిన 'హ్యూమా' 'షకీలా' పాత్ర పోషించేందుకు 'సై' అందట.  


(266)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ