లేటెస్ట్

ఎన్నికలకు సొమ్ములు లేవన్న ఉత్తరాంధ్ర మంత్రి...!

అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరాలని...ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు 'చంద్రబాబునాయుడు' కష్టపడి, అహోరాత్రులు శ్రమించి పనిచేస్తే...కొందరు టిడిపి మంత్రులు మాత్రం ఎన్నికలను తేలిగ్గా తీసుకున్నారట. గెలిస్తే.. గెలుస్తాం...లేదంటే లేదు..సంపాదించిన సొమ్ములను మాత్రం ఎన్నికల్లో ఖర్చు చేయమని తేల్చి చెప్పారట. రాక రాక అధికారంలోకి వచ్చాం..మంత్రి అయ్యాం..బాగా సంపాదించుకున్నాం...కానీ..ఆ సొమ్ములు ఎందుకు ఖర్చు చేయాలి..? అని మంకుపట్టుపట్టారట. పోలింగ్‌ జరిగిన తరువాత..కొందురు టిడిపి నాయకులు, మంత్రులు వ్యవహరించిన తీరు గురించి టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఫిర్యాదులు అందుతున్నాయి. 

ఉత్తరాంధ్రకు చెందిన మంత్రి ఒకరు మొన్న జరిగిన ఎన్నికల్లో ఖర్చు పెట్టడానికి సుముఖత వ్యక్తం చేయలేదట. ఐదేళ్లు మంత్రిగా ఉన్న ఈయన ఎన్నికల్లో గెలవాలంటే చేయాల్సిన ఖర్చు గురించి వెనకా ముందాడుతున్న వైనాన్ని తెలుసుకున్న టిడిపి పెద్దలు..అసలు ఏమయింది..? ఎందుకు ఎన్నికల ఖర్చు కోసం వెనకాడుతున్నారు..మీరు గత ఐదేళ్లుగా బాగానే సంపాదించుకున్నారుగా...ఇప్పుడు పార్టీ గెలవాలంటే..మీ నియోజకవర్గానికైనా మీరు ఖర్చు పెట్టుకోవాలి కదా..? అన్నీ పార్టీ పెద్దలు తేలేరు కదా..? అని ప్రశ్నిస్తే...'సంపాదించుకున్న సొమ్మును తాను తీయనని, అధిష్టానం సొమ్ములు ఇస్తేనే ఓటర్లకు పంచుతానని..లేకుంటే లేదని తేల్చి చెప్పారట. ఆయన వ్యవహారశైలి చూసిన టిడిపి నాయకులు..ఈయనేం మంత్రి...మంత్రిగా అడ్డగోలుగా సంపాదించుకున్నారు..ఆయన ఖర్చులు ఆయన పెట్టుకోకపోతే ఎలా..? అని ఆక్షేపించారట. అయినా ఆ మంత్రిగారు..మాత్రం దిగిరాలేదట. చివరకు పార్టీ అధిష్టానం ఇచ్చిన సొమ్ములను అరా కొరగా పంచి మమ..అనిపించారట. ఏది ఏమైనా..ఒక బడా రాజకీయనేత వారసుడిగా రంగంలోకి వచ్చిన..ఆయన మళ్లీ గెలుస్తారని చెబుతున్నారు. కానీ...ఆయన వైఖరిపై అధిష్టానం ఆగ్రహంతో ఉందని ప్రచారం జరుగుతోంది.

(275)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ