WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

శృంగార చిత్రాల్లో నటించను:సలోనీ

'మర్యాద రామన్న' చిత్రంతో హిట్‌ కొట్టి...ఆనక కనిపించకుండా పోయిన 'సలోనీ' గుర్తుందా...? ఆమె ఇప్పుడు 'థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృధ్వీ' చిత్రం 'మీలో ఎవరు కోటీశ్వరుడు'తో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆ సినిమా 16వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ తనను శృంగార, కామెడీ,హారర్‌ చిత్రాల్లో చేయమని చాలా మంది అడుగుతున్నారని...అయితే తాను వాటిని ఒప్పుకోవడం లేదని, అందువల్లే తనకు సినిమా అవకాశాలు రావడం లేదని తెలిపింది. అటువంటి చిత్రాల్లో నటించడానికి అంగీకరిస్తే తనకు చాలా అవకాశాలు వచ్చేవని..తెలిపిందీ అమ్మడు...మొత్తానికి 'సలోని' నిజాల్ని నిర్భయంగా చెప్పిందని టాలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. అడల్డ్‌ కామెడీ, హార్రర్‌ చిత్రాలు ఇప్పుడు తెలుగులో హాట్‌ ఫేవరెట్‌...మరి అటువంటి చిత్రాలు వద్దని 'సలోని' అందంటే విశేషమే మరి...అయితే తాజాగా ఆమె ఆశపెట్టుకున్న 'మీలో ఎవరు కోటీశ్వరుడు' విజయం సాధిస్తే చిన్న చిత్రాలోనైనా అవకాశాలు వస్తాయోమో...!


(849)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ