WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కరిష్మా'కు కొత్త ప్రియుడు దొరికాడోచ్‌...!

సినిమాలకు గుడ్‌బై చెప్పి పెళ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకుంటున్న 'కరిష్మాకపూర్‌' తాజాగా భర్తకు విడాకులు ఇచ్చిందట. భర్తకు విడాకులు ఇచ్చిన ఆమె తన పాతస్నేహితుడితో మళ్లీ షికారులు చేస్తుందట. దీంతో ముంబాయి పత్రికలన్నీ 'కరిష్మా'కు కొత్త బాయ్‌ఫ్రెండ్‌ దొరికాడోచ్‌...అంటూ హెడ్డింగ్‌లు పెట్టి పండుగ చేసుకుంటు న్నాయట. వారి పండగను మరింత రెట్టింపు చేయడానికి 'కరిష్మా' తన వంతుగా వారి ప్రోత్సహిస్తుందట. ఇప్పుడు ఎక్కడ చూసినా...'కరిష్మా' ఆమె కొత్త ప్రియుడు 'సందీప్‌ తోస్నివాల్‌' చక్కెరలు కొడుతున్నారట. ఈ 'సందీప్‌' 'కరిష్మా'కు మరీ కొత్తేం కాదు..పాత కాలంలో ఇతను 'కరిష్మా'కు ఫ్రెండేనట. ఆమె పెళ్లి చేసుకున్న తరువాత కూడా వీరిద్దరూ కలసి కొన్నాళ్లు రహస్యంగా కలసి ఉన్నారట. ఈ సంగతి తెలిసే 'కరిష్మా' భర్త ఆమెను వదిలేశాడని 'ముంబాయి' పత్రికలు రాస్తున్నాయి...మరి నిజానిజాలు...'కరిష్మా'కు 'సందీప్‌'కే తెలియాలి.


(167)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ