WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ప్రేక్షకులను ఆకట్టుకోలేని 'అమీర్‌పేటలో...!

హైదరాబాద్‌ అంటే ఎవరికైనా ఠక్కున గుర్తుకొచ్చే ప్రాంతాల్లో అమీర్‌పేట ఒకటి. సాఫ్ట్‌వేర్‌కు సంబంధించిన పలు కోర్సులకు ఇక్కడ తక్కువ మొత్తంలోనే బెస్ట్‌ ఫ్యాకల్టీ దొరుకుతుంది. దీంతో ఈ ప్రాంతం ఎప్పుడూ అమ్మాయిలు, అబ్బాయిలతో సందడిగా ఉంటుంది. అమీర్‌ పేటలో 2500 సైగా సాఫ్ట్‌వేర్‌ ట్రయినింగ్‌ సెంటర్స్‌, 1500 పైగా బాయ్స్‌, లేడీస్‌ హాస్టల్స్‌ ఉన్నాయి. ఇక్కడ అమ్మాయిలు, అబ్బాయిలు ఎలా ఆలోచిస్తారు. సాఫ్ట్‌వేర్‌ రంగానికి, సినిమా రంగానికి ఉన్న సంబంధాలు, అమీర్‌పేటలోని యువత చేసే తప్పొప్పులు,గురించి చాలా సినిమాలే వచ్చాయి. అలాంటి కోవలో తెరకెక్కిన సినిమాయే %తత%అమీర్‌పేటలో...%తత%. అయితే ఇలాంటి విషయాలను ఉన్నది ఉన్నట్లుగా చెబితే సినిమా మరో కోణంలోకి వెళ్లిపోతుంది కాబట్టి దర్శకుడు శ్రీ తాను చెప్పాలనుకున్న విషయాలకు కాస్తా సామాజిక సమస్యలను, వాటి పరిష్కారాల గురించి తనకు తోచిన స్టయిల్లో చూపుతూ చేసిన సినిమా అమీర్‌ పేటలో..  సినిమా చేశాడు. మరి ఈ సినిమా ఏ మేర ప్రేక్షకులను ఆకట్టుకుందో తెలుసుకోవాలంటే కథలోకి వెళదాం...

కథః

వివేక్శ్రీ(శ్రీ) హైదరాబాద్‌ నగరానికి రాగానే సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి రావాలా, సినిమా రంగంలోకి రావాలా? అని ఆలోచించి సినిమా రంగం వైపు అడుగులేస్తాడు. వివేక్‌ తో పాటు అతని రూంలో చిట్టి, వెంకట్రావు, లింగబాబు అనే ముగ్గురు స్నేహితులు ఉంటారు. అందరూ మందు కొడుతూ, పేకాడుతూ కాలక్షేపం చేస్తుంటారు. ఓ సందర్భంలో వివేక్‌కు ప్రియ(అశ్విని) పరిచయం అవుతుంది. ప్రియతో డేటింగ్‌ చేయాలనుకుంటాడు వివేక్‌. ఈ విషయంపై ప్రియ కూడా ఆసక్తి చూపుతుంది. కానీ ప్రియ దృష్టిలో ప్రేమంటే గౌరవభావన ఉండటంతో విజయ్‌, ప్రియలు ఫ్రెండ్స్‌లాగానే ఉండిపోదామనుకుంటారు. ఈలోపు వివేక్‌ రెండేళ్లు సినిమా రంగంలో కష్టపడి తర్వాత సాఫ్ట్‌వేర్‌ రంగంలోకి వచ్చి మంచి జాబ్‌ సంపాదిస్తాడు. ఓసారి ప్రియ కొంత మంది అనాథ పిల్లలను కలుస్తుంది. వారందరూ ఆకలితో పస్తులుండటం గమనించి, ఎలాగైనా వారికి సహాయం చేయాలనుకుంటుంది. వివేక్‌తో పాటు అతని స్నేహితులు కొంత మందిని సహాయం అడుగుతుంది. ముందు వారందరూ సహాయం చేయడానికి నిరాకరించినా, చివరకు అనాథ పిల్లలకు సహాయం చేయడానికి ముందుకు వస్తారు. ఇంతకు వారందరినీ ప్రభావితం చేసిన పరిస్థితులేంటి? చివరకు వివేక్‌, ప్రియల ప్రేమ సక్సెస్‌ అవుతుందా? వివేక్‌ స్నేహితులు, రూమ్మేట్స్‌లో వచ్చే మార్పేంటి? అనే విషయాలను తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే...సినిమాను రెండు భాగాలుగా చూసినప్పుడు ఫస్టాఫ్‌ అంతా యూత్‌ను టార్గెట్‌ చేసి తీశారు. అమీర్‌ పేటలో యువత ఆలోచనలు, దృక్పథాలు ఎలా ఉంటాయనే విషయాన్ని హీరో అతని నలుగురు స్నేహితులను బేస్‌ చేసుకుని తెరపై చూపించారు. అమీర్‌ పేటలో హాస్టల్స్‌లో వద్ద కొంత మంది అమ్మాయిలు, వారి తల్లిదండ్రులతో ఎలా ప్రవర్తిస్తున్నారు అనే విషయాన్ని కూడా చక్కగా ప్రెజంట్‌ చేశాడు దర్శకుడు శ్రీ. ఇక సెకండాఫ్‌ విషయానికి వస్తే సమాజానికి సంబంధించిన అంశాలను స్పృశించారు. చిట్టి, లింగబాబు, వెంకట్రావు క్యారెక్టర్స్‌పై క్రియేట్‌ చేసిన కామెడి పెద్దగా నవ్వించలేదు. అక్కడక్కడా డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ వినపడ్డాయి. హీరోగా, దర్శకుడుగా శ్రీ మంచి మార్కులే సంపాదించుకున్నాడు.తొలి సినిమా అయినా తనకున్న వనరులతో పరావాలేదనిపించాడు. దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడో పక్కా క్లారిటీతో గ్రిప్పింగ్‌గా తెరపై చూపించలేకపోయాడు. ఎందుకంటే ఫస్టాఫ్‌లో యూత్‌ చుట్టూ తిరిగే కథ, సెకండాఫ్‌ వచ్చేసరికి అనాథ పిల్లలు, వారి పోషణ వంటి విషయాలను చూపించాడు. దీంతో ఫస్టాఫ్‌లో చెప్పాలనుకున్న విషయాన్ని సెకండాఫ్‌లో లైట్‌గా టచ్‌ చేసి చెప్పేశాడు. మురళి లియోన్‌ సంగీతం సినిమాకు ప్లస్‌ అయ్యింది. అమీర్‌ పేటలో..టైటిల్‌ సాంగ్‌, పిల్లలపై వచ్చే సాంగ్‌ సహా ట్యూన్స్‌ ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్‌ మ్యూజిక్‌ బావుంది. కిరణ్‌ గ్వారా సినిమాటోగ్రఫీ అధ్వానంగా ఉంది. సినిమాటోగ్రఫీతో వండర్స్‌ క్రియేట్‌ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో కిరణ్‌ గ్వారా సినిమాటోగ్రఫీని చూసి ప్రేక్షకులు నోరెళ్లబెట్టడం ఖాయం. రన్‌ టైంను వీలైనంత కుదించే ప్రయత్నం చేసినా సినిమాను ఇంకా ఎడిట్‌ చేసుండాలనిపిస్తుంది. సీన్స్‌ మధ్య లింక్‌ మిస్‌ అయ్యింది.


 


(292)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ