WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'శేఖర్‌రెడ్డి' తొలగింపు చెల్లుతుందా....?

టిటిడి బోర్డు సభ్యుడు అయిన శేఖర్‌రెడ్డిని తొలగింపు ఉత్తర్వులు జారీ చేయడం చెల్లుబాటు అవుతుందా....? కాదా అనే విషయం అధికార వర్గాల్లో చర్చనీయాంశమైంది. వ్యక్తిగతమైన ఆరోపణలు, ఇతర విమర్శలు ఆధారంగా బోర్డు సభ్యులెవరినీ తొలగించలేదు. ఒక సభ్యుడిని తొలగించాలంటే టిటిడిలో అధికారదుర్వినియోగంతో పాటు ఇతర అభియోగాలను మాత్రమే పరిశీలనలోకి తీసుకుని వాటిపై విచారించాలి. ఆ విచారణలో ఆయా ఆరోపణలు రుజువు అయితే నోటీసు ఇవ్వాలి. ఆ నోటీసుకు సంబంధిత సభ్యుడు జవాబు ఇవ్వాలి. దీనికి సుమారు నెలరోజులు టైం పడుతుంది. కానీ...శేఖర్‌రెడ్డి విషయంలో ఆ విధానాలను పాటించలేదు. దీనిపై ఆయన కోర్టుకు వెళితే ఆయనకు స్టే దొరకడం ఖాయం. ఈ నిబంధనల మొత్తం అధికారులకు తెలుసు. కానీ...సిఎం అతి ఆవేశంతో ఉత్తర్వులు జారీ అయ్యాయి. సభ్యుడిగా నియమించే ముందుకు ఎవరెవరు సిఫార్సు చేసినా ఆయా వ్యక్తుల గుణగణాలను, వారి పాత చరిత్రను పరిగణలోకి తీసుకున్నాకే వారిని నియమించాలి. అటువంటిదేమీ చేయకుండా...? ఎవరో సిఫార్సు చేశారనో...ఇతర రాష్ట్రాల కోటా అనో కారణాలు చూపించి సభ్యులుగా నియమిస్తున్నారు. ఈ నిబంధనలను మార్చాలని టిటిడి అధికారులు గత పదేళ్ల నుండి మొత్తుకుంటున్నా పాలకులెవరూ పట్టించుకోలేదు. 

   'శేఖర్‌రెడ్డి' దగ్గర వందల కోట్లు ఎలా దొరికాయనేది ఆదాయపన్ను శాఖకు సంబంధించింది..టిటిడికి సంబంధించిన నిబంధనల ప్రకారం ఇప్పటికీ శేఖర్‌రెడ్డి అధికారదుర్వినియోగం, అవినీతికి పాల్పడలేదు. దీనిపై స్పందించేందుకు ఉన్నతాధికారులు అంగీకరించడం లేదు. దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి కూడా దీనిపై స్పందించేందుకు నిరాకరించారు. మంత్రి ఉన్నా లేనట్లే...సంబంధించిన ఫైల్‌ ఆయనకు వెళ్లదు. ఈ నేపథ్యంలో 'శేఖర్‌రెడ్డి' ఆదరాబదరాగా తొలగింపు ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటి? ఆయన కోర్టుకు వెళితే పరిస్థితి ఏమిటి? ఇవన్నీ గమనించకుండా సిఎం చంద్రబాబు అతిగా స్పందించి అపవాదును మూటగట్టుకోబోతున్నారు. 'శేఖర్‌రెడ్డి' కోర్టుకు వెళతారా...? లేదా అనేది ఇంత వరకు తెలియడం లేదు.  1995లో టిటిడి బోర్డును దివంగత ఎన్టీఆర్‌ హయాంలో నియమించడం జరిగింది. 

   ఎన్టీఆర్‌ అధికారం కోల్పోవడంతో టిటిడి బోర్డు ఛైర్మన్‌తో పాటు ఒక సభ్యుడు మినహా మిగతావారందరూ రాజీనామా చేశారు. ఆ సభ్యుడిని రాజీనామా చేయమని కోరినా ససేమిరా అన్నారు. ఆయనను తొలగించాలని అప్పట్లో 'చంద్రబాబు' విశ్వప్రయత్నాలు చేసి విఫలమై ఆ బోర్డు గడువు ముగిసే వరకు ఎదురుచూడాల్సి వచ్చింది. నిబంధనలు ఆ విధంగా ఉన్నాయి. రాజీనామా చేసిన కొంత మంది సభ్యులు కూడా 'అయ్యో...ఎందుకు రాజీనామా చేశామని వాపోయారు. నియమించడం...చాలా సులువు...తొలగించడం చాలా కష్టం...! ఈ నిబంధనలు అధికారులకు, సిఎంకు కూడా తెలుసు. కానీ ప్రజల్లో మంచిపేరు తెచ్చుకోవాలనే తపన తప్ప...చంద్రబాబుకు నిబంధనలు ఈ సమయంలో కనిపించడం లేదు..ఇప్పటికి తెలిసన సమాచారం ప్రకారం 'శేఖర్‌రెడ్డి' కోర్టుకు వెళ్లే అవకాశం ఉంది.

(337)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ