'వదిన'ను చంపిన 'ఉమ':వాసిరెడ్డి పద్మ...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'వదిన'ను చంపిన 'ఉమ':వాసిరెడ్డి పద్మ...!

అన్న మంత్రి హోదాలో రైలు ప్రమాదంలో చనిపోతే...తల్లిలాంటి వదినను ఓదార్చవలసిన ఆయన సోదరుడు ప్రస్తుత 'జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు' ఆమె ఆత్మహత్యకు పరోక్షంగా కారణమని... అటువంటి వ్యక్తికి 'జగన్‌'కు విమర్శించడమా...? చెంపలు పగలగొడ్తామని వైకాపా అధికార ప్రతినిధి 'వాసిరెడ్డి పద్మ' హెచ్చరించారు. మంత్రి 'ఉమ'పై వ్యక్తిగత విమర్శలు గుప్పిస్తూ ఆమె చేసిన ఆరోపణలు సంచలనం సృష్టించాయి. ఆమె ఒక్కసారిగా ఇటువంటి ఆరోపణలు గుప్పించడం వెనుక కారణమేమై ఉంటుందా అని రాజకీయవిశ్లేషకులు ఆరా తీస్తున్నారు. వై.ఎస్‌.జగన్‌ను 'ఉమా'ను టార్గెట్‌ చేశారని..అందువల్లే ఒక్కసారిగా ఆమె 'ఉమా'పై విరుచుకుపడిందని మరి కొన్ని వర్గాలు అంటున్నాయి. 

    మంత్రి ఉమాకు మతి భ్రమించిందని, ఆయన్ను పిచ్చాసుపత్రిలో చేర్చించాలని, ఇటు వంటి నేత తమ నేతను విమర్శించడం 'దెయ్యాలు వేదాలు..వల్లించిన చందేమనని' ఆమె విరుచుకుపడ్డారు. నీటిపారుదలశాఖల్లో కమీషన్లు పోతున్నాయనే బాధతోనే 'ఉమ' 'జగన్‌'పై విమర్శలు చేస్తున్నారని ఆమె అన్నారు. అన్న రైలు ప్రమాదంలో మరణిస్తే ఆయన వారసత్వం వదినకు వస్తుందన్న భయంతో సొంత వదినను చంపిన ఖ్యాతి 'ఉమ'కే దక్కుతుందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఈ సంగతి కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసనని, హత్యారాజకీయాలతోనే 'ఉమ' పైకి వచ్చారని ఇటువంటి నేతలు 'జగన్‌' కేసుల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని విమర్శించారు.  'ఉమ' బాస్‌ 'చంద్రబాబు' కూడా ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి రాజకీయాల్లో ఎదిగారని, ఇటువంటి నేతలు ప్రజాభిమానంతో పైకి వచ్చిన 'జగన్‌'ను విమర్శిస్తారా...అంటూ ఆమె ధ్వజమెత్తారు. మంత్రి ఉమ ఇప్పటికైనా ఒళ్లు దగ్గరపెట్టుకుని ఉండాలని లేకుండా చెంపలు వాయిస్తామని ఆమె హెచ్చరించారు.


(735)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ