WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నాయర్‌' త్రిపుల్‌ సెంచరీ:భారత్‌ రికార్డు స్కోరు...!

యువ బ్యాట్స్‌మెన్‌ 'కరుణ్‌నాయర్‌' త్రిపుల్‌ సెంచరీ సాధించడంతో ఇంగ్లాండ్‌తో చెన్నయ్‌లో జరుగుతున్న చివరి టెస్టులో భారత్‌ రికార్డు స్కోరు సాధించింది. నిన్న 'లోకేష్‌రాహుల్‌' ఇంగ్లాండ్‌ బౌలర్లను చితకబాదగా నేడు 'కరుణ్‌నాయర్‌' ఆ పనిచేశాడు. 'కరుణ్‌'కు 'అశ్విన్‌, జడేజా,విజయ్‌లు తోడ్పాటు అందించారు. మొత్తం 381 బంతులను ఎదుర్కొని 24 ఫోర్లు 4సిక్స్‌ల సహాయంతో 'కరుణ్‌నాయర్‌' 303 పరుగులతో నాటౌట్‌గా మిగిలాడు. టెస్టుల్లో భారత్‌ తరపున త్రిపుల్‌ సెంచరీ చేసిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా 'నాయర్‌' రికార్డు సృష్టించాడు. ఇంతకు ముందు డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ మాత్రమే టెస్టుల్లో భారత్‌ తరుపున త్రిపుల్‌ సెంచరీ సాధించాడు. 'సెహ్వాగ్‌' ఈ ఫీట్‌ను రెండుసార్లు సాధించాడు. మరోసారి 299పై అవుట్‌ అయి రికార్డును మిస్‌ చేసుకున్నాడు. కాగా తాజాగా 'నాయర్‌' త్రిపుల్‌ సెంచరీ చేయడంతో భారత్‌ తరుపున త్రిపుల్‌ సెంచరీ సాధించిన రెండో వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. 'నాయర్‌'తో పాటు మిగతా బ్యాట్స్‌మెన్‌ తలో చేయివేయడంతో భారత్‌ రికార్డు స్కోరు సాధించింది. ఏడు వికెట్లు నష్టపోయి భారత్‌ 759 పరుగులు చేసింది. ఇది టెస్టులో భారత్‌కు అత్యధిక స్కోరు. 2009లో శ్రీలంకపై భారత్‌ సాధించిన 726 పరుగులే టాప్‌స్కోరుగా ఉండేది. ఇప్పుడు ఆ రికార్డును భారత్‌ తిరిగరాసింది. మొత్తం మీద ఇంగ్లాండ్‌పై తొలి ఇన్సింగ్స్‌లోనే భారత్‌ 282పరుగుల భారీ ఆధిక్యాన్ని సంపాదించి మ్యాచ్‌పై తిరుగులేని పట్టుసాధించింది. నాల్గవ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ రెండో ఇన్సింగ్స్‌లో వికెట్‌ నష్టపోకుండా 12 పరుగులు చేసింది. చివరి రోజు ఆటలో ఇంగ్లాండ్‌ మరో 270 పరుగులు చేస్తే ఇన్సింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకోగలుగుతుంది. లేదా...వికెట్లు కోల్పోకుండా రోజంతా బ్యాటింగ్‌ చేయాల్సి ఉంటుంది. స్పిన్‌కు అనుకూలిస్తున్న చెపాక్‌ పిచ్‌పై ఐదవ రోజు భారత్‌ ఏస్‌ స్పిన్నర్‌ 'అశ్విన్‌'ను ఎదుర్కోవడం బ్రిటీషర్లకు కష్టమైన పనే. చివరి టెస్టు కనుక భారత్‌ గెలిస్తే సిరీస్‌ను 4-0తో భారత్‌ వశం అవుతుంది.


(218)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ