WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కోహ్లీ,అశ్విన్‌' రాణించకున్నా...గెలుపు మనదే...!

ఇంగ్లాండ్‌తో జరిగిన ఐదవ టెస్టులో భారత్‌ మేటిఆటగాళ్లు రాణించకున్నా భారత్‌ సునాయాసంగా విజయం సాధించింది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, ఏస్‌ స్పిన్నర్‌ 'అశ్విన్‌'లు ఈ మ్యాచ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. బ్యాటింగ్‌లో కెప్టెన్‌ కోహ్లీ కేవలం 15పరుగులు మాత్రమే చేశాడు. మరో వైపు ప్రధాన బౌలర్‌ 'అశ్విన్‌' మ్యాచ్‌ మొత్తంలో కేవలం ఒక వికెట్‌ మాత్రమే తీశాడు. అశ్విన్‌ ఈ మ్యాచ్‌లో మొత్తం 69 ఓవర్లు బౌలింగ్‌ చేసి 207 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ మాత్రమే తీయగలిగాడు. అయితే బ్యాటింగ్‌లో అర్థసెంచరీ చేసి గెలుపులో తన వంతు పాత్రపోషించాడు. మ్యాచ్‌లో భారత్‌ ప్రధాన ఆటగాళ్లు అశ్విన్‌, కోహ్లీ, పుజారా, విజయ్‌లు విఫలమైనా భారత్‌ ఇంగ్లాండ్‌ జట్టును ఇన్సింగ్స్‌ 75 పరుగుల తేడాతో మట్టి కరిపించింది. మొదట యువ బ్యాట్స్‌మెన్‌ 'లోకేష్‌రాహుల్‌' తన అధ్బుతమైన ఆటతో 199 పరుగులు చేసి భారత్‌కు భారీ స్కోరు పునాది వేయగా...తరువాత 'కరుణ్‌నాయర్‌' త్రిపుల్‌ సెంచరీతో ఇంగ్లాండ్‌ జట్టును వణికించాడు. 'కరుణ' త్రిపుల్‌ సెంచరీ, పటేల్‌, అశ్విన్‌, జడేజాల అర్థసెంచరీలు భారత్‌కు భారీ స్కోరును సాధించిపెట్టాయి. 

  ఐదవ రోజు ఆటలో ప్రధాన స్పిన్నర్‌ 'అశ్విన్‌' విఫలమైనా ఆ లోటును తీరుస్తూ 'జడేజా' విజృంభించాడు. బ్రిటీషర్లు తీవ్రంగా ప్రతిఘటించినా...'జడేజా' ఓర్పుతో వారిని ఔట్‌ చేశాడు. మొదట ఇంగ్లాండ్‌ బ్యాట్స్‌మెన్‌ రెండో ఇన్సింగ్స్‌లో 103 పరుగుల వరకు వికెట్‌ కోల్పోకపోవడంతో మ్యాచ్‌ డ్రా అవుతుందేమోనని ఎక్కువ మంది అభిమానులు భావించారు. అయితే 'జడేజా' కెప్టెన్‌ కుక్‌ను అవుట్‌ చేసి వికెట్ల పతనానికి శ్రీకారం చుట్టాడు. దీంతో 129 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఇంగ్లాండ్‌ త్వరగానే ఆలౌట్‌ అవుతుందని అభిమానులు అంచనా వేశారు. అయితే అనూహ్యంగా మళ్లీ ఇంగ్లాండ్‌ నుండి ప్రతిఘటన ఎదురయింది. ఈసారి 'అస్ట్రోక్స్‌ ఇంగ్లాండ్‌ను సురక్షిత స్థితికి తీసుకెళ్లేటట్లు కనిపించారు. అయితే 'అ 'జడేజా' అవుట్‌ చేయడంతో ఈ జంట 192 పరుగుల వద్ద విడిపోయింది. అప్పటికే మ్యాచ్‌ ముగిసే సమయం దగ్గర పడుతోంది. ఇంగ్లాండ్‌ 192/5 వద్ద ఉంది. ఇంగ్లాండ్‌ ఓటమి తప్పించుకోవాలంటే మరో 18 ఓవర్లు మాత్రమే ఆడాల్సి ఉంది. అయితే స్ట్రోక్స్‌ పట్టుదలతో ఆడుతుండగా అతనికి బ్లటర్‌ పూర్తి స్థాయిలో సహకరించాడు. ఇద్దరూ కలసి ఓవర్లు కరిగిస్తుంటే భారత్‌ అభిమానులు ఆందోళనకు గురి అయ్యారు.   'జడేజా' బౌలింగ్‌లో నాయర్‌ అందుకున్న సూపర్‌ క్యాచ్‌తో స్ట్రోక్స్‌ ఇంటిముఖం పట్టడంతో భారత్‌ విజయం ఖాయమైపోయింది. రషీద్‌,బ్రాడ్‌లు మరో ఐదు ఓవర్ల పాటు భారత్‌ విజయాన్ని అడ్డుకున్నారు. అయితే జడేజా సూపర్‌ బంతులకు వారు ఎక్కువ సేపు నిలవలేకపోయారు. దీంతో మరో రెండు ఓవర్లు మిగిలి ఉండగానే భారత్‌ను విజయం వరించింది.


(376)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ