WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జెసి'కి కులం...కావాలి...అధికారమూ...కావాలి...!

ఆయన కరుడుగట్టిన కాంగ్రెస్‌ వాది. పదేళ్లు అధికారాన్ని చెలాయించారు. అహంకారంగా మాట్లాడతారు... ఎవరినీ లెక్కచేయనట్లు కనిపిస్తారు...! ఏ కులం వారైనా సరే తన ముందు కూర్చుని మాట్లాడితే భరించలేరు. స్వకులస్థులు తప్ప ఇతర కులస్తులు ఎవరైనా ఆయన అడుగులకు మడుగులొత్తాలి...అణిగి..మణిగి ఉండాలి...ఆయన తిట్టినా..కొట్టినా...భరించాలి. ఐదేళ్లు మంత్రి పదవి నిర్వహించారు. మరో ఐదేళ్లు ఎమ్మెల్యే పదవితో అధికారం చెలాయించారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్‌ పార్టీ కనుమరుగు కావడంతో అయిష్టంగానే టిడిపిలో చేరి ఎంపిగా పోటీ చేసి విజయం సాధించారు. అయినా ఆయనకు తృప్తి లేదు. అదేమిటంటే రెండు రాష్ట్రాల్లో మా కులస్థులు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడబడుతున్నారని వ్యాఖ్యానిస్తారు. 

   మంత్రి పదవిలో ఉన్నప్పుడు తన సామాజికవర్గానికి చెందిన వారికి కీలక ప్రాధాన్యత పోస్టులను ఇస్తుండేవారు..ఇదేమిటని...అప్పట్లో ఆ శాఖాధిపతి ప్రశ్నించగా మేము అధికారంలో ఉండి కూడా ఈ విధంగా చేసుకోపోతే ఎలా..? అని సమాధానం చెప్పేవారు. 'చంద్రబాబు' హయాంలో ఆ పరిస్థితి ఉండేది కాదు..అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇచ్చేవారని ఆ అధికారి చెప్పగా...ఆయన పిరికివాడు...కులాల వారీగా పోస్టులు ఇచ్చారు...ఆయన 'కమ్మ' కులస్తులను కూడా దూరం పెట్టారు..అందుకే అధికారం కోల్పోయారు. ఇంటగెలిచి రచ్చ గెలవాలనే సామెత ఉంది కదా...మేము అదే పనిచేస్తున్నాం..ముందు మా కులస్తులకు...తరువాత మా పల్లకి మోసేవారికి...అని మంత్రి సమాధానం చెప్పడంతో ఆ శాఖాధిపతి నివ్వెరపోయి...ఇంత 'కులాభిమానమా...? అని మీడియా వర్గాలతో ఆఫ్‌ ది రికార్డుగా చెప్పుకుని ఆవేదన వ్యక్తం చేశారట. టిడిపిలో చేరినా...ఆయన పోకడ అదే విధంగా ఉంది. మా కులం వాళ్లకి అన్యాయం జరిగిందని వాపోతుంటారు..అని 'జగన్‌'ను కూడా వదలి పెట్టరు...మా రెడ్లందరూ 'జగన్‌' వైపే మొగ్గుచూపుతున్నారు..అది మంచిది కాదని అంటుంటారు..అంతే కాకుండా మరింత దూకుడుగా మాట్లాడుతూ...ఆయన క్రైస్తవుడు...మేము హిందువులం...మా రెడ్లు ఆయనకు ఎందుకు మద్దతు ఇస్తారో...అర్థం కావడం లేదని...మన హిందువులం..అని తమ సామాజికవర్గ ఓటర్లకు సలహాలు ఇస్తారు..ఆయన ఎవరో కాదు..అనంతపురం జెసి దివాకర్‌రెడ్డి. 

   కాంగ్రెస్‌ వాదిగా రాజకీయాల్లోకి వచ్చారు. ముప్పయి సంవత్సరాలు అదే పార్టీలో కొనసాగి రాజకీయ మనుగడ కోసం తెలుగుదేశం పార్టీలో చేరి లబ్ది పొందినప్పటికీ సంతృప్తి కలగడం లేదు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఆయన హవా సాగడం లేదు. 'పరిటాల' సామాజికవర్గ నాయకులు అధికారం చెలాయిస్తున్నారు...మేము వాళ్ల కింద పనిచేయాల్సి వస్తుందని తరచూ వ్యాఖ్యానిస్తుంటారు. మరొక వైపు...ఆ సామాజికవర్గం వారితో మొదటి నుండి ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అధికారం వేరు...కులం వేరు..అంటారు..అదేమిటంటే...ఆ కులం వారందరూ మా కులం కింద పనిచేయాలి తప్ప మాతో సమానంగా ఉండకూడదన్నది ఆయన ఆలోచన. అందుకే అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరితో కయ్యానికి దిగుతుంటారు. ప్రభాకర్‌చౌదరి కూడా నిజాయితీపరుడైన రాజకీయనాయకుడే...కానీ..ఆయన జెసి సామాజికవర్గానికి చెందినవారు కాకపోవడంతో పుల్లవిరుపుమాటలతో బాహాటంగా..పరోక్షంగా విమర్శలు చేస్తుంటారు. టిడిపిని వీడి 'జగన్‌' పార్టీలో మీరు చేరతారా...? అని ఎవరైనా ప్రశ్నిస్తే...'మేము అధికారం శాసించామే తప్ప...బానిసలుగా పనిచేయలేం...అని చెబుతారు...! అంటే 'జగన్‌' ఆయనకు కనీస మర్యాద ఇవ్వరని పరోక్ష అర్థం. 'చంద్రబాబు' బాగా అభిమానిస్తున్నారు కదా...ఇంకేమిటి మీకు లోటు అంటే...! టిడిపిలో కూడా సంతృప్తిగా ఉన్నాను..! అందరూ నన్ను గౌరవిస్తున్నారు..కానీ..మా కులం వాళ్లు అధికారం కోల్పోయారనే బాధ పీడిస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తుంటారు. ఎప్పుడు ఏ విధంగా విమర్శలు, ఆరోపణలు చేస్తారో ఆయనకే తెలియదు...ఒక సందర్భంలో 'చంద్రబాబు'ను పొగుడుతారు..మరో సందర్భంగా ఆఫ్‌ ది రికార్డుగా ఆయనను విమర్శిస్తారు...! నీకు అధికారం దక్కింది కదా...ఇంకెందుకు మీకు బాధ అని అడిగితే...ఏదైనా కులాభిమానం ఉంటుంది కదా..అంటారు..భవిష్యత్‌లో ఆయన కుమారుడు 'జగన్‌' పార్టీలో చేరతారని ప్రచారం జరుగుతుంది కదా..అని ప్రశ్నిస్తే...ఆయన కొట్టిపారేస్తూ...మాది ఉమ్మడి కుటుంబం..అదే విధంగా పార్టీ కూడా ఉమ్మడిగానే ఉంటుంది..అటువంటి పరిస్థితి ఉండదు..అని చెబుతారు..! మొత్తం మీద అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి ఎప్పుడు ఎవరిపై మాటలు తూటాలు పేలుస్తారో...ఎవరిపై అభిమానాన్ని ప్రకటిస్తారో ఆయనకు తెలియదు. 

   తాజాగా 'చంద్రబాబు'పై ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో చంద్రబాబు మొహం చూసే తమను ఓటర్లు గెలిపించారని...ఈసారి ఆయన మొహం చూసి ప్రజలు ఓటు వేయరని పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలు 'చంద్రబాబు' చెవికి చేరడం..ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగిపోయాయి. పార్టీ లైన్‌ దాటి వ్యవహరిస్తే ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని 'బాబు' వార్నింగ్‌ ఇచ్చారు..మరి 'బాబు' వార్నింగ్‌ 'జెసి'లో మార్పు తెస్తుందా...అంటే వేచి చూడాల్సిందే...!
(712)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ