WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కృష్ణా'లో 'వైకాపా'కు చావుదెబ్బ...!

'దేవుడు కరుణిస్తే...మరో సంవత్సరంలోనో...ఆరు నెలల్లోనో ముఖ్యమంత్రి అవుతానని' పదే పదే కలలు కంటున్న వైకాపా అధినేత వై.ఎస్‌.జగన్‌కు స్వంత ఎమ్మెల్యేల నుండి భారీ షాక్‌ ఎదురు కానుంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి అధికార టిడిపిలో చేరినా పెద్దగా లెక్క చేయకుండా తిరుగుతున్న వైకాపా అధినేతకు కృష్ణా జిల్లా ఎమ్మెల్యేలు చావుదెబ్బ కొట్టబోతున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా తరుపున ఐదుగురు ఎమ్మెల్యేలు గెలవగా వారిలో 'జలీల్‌ఖాన్‌' పార్టీ నుంచి మొదటి ఏడాదిలోనే తప్పుకున్నారు. ఇప్పుడు ఆయన దారిలో మరో ముగ్గురు ఎమ్మెల్యేలు 'జగన్‌'కు జెల్లకొట్టబోతున్నారు. ముందుగా 'పామర్రు' ఎమ్మెల్యే 'ఉప్పులేటి కల్పన' రేపు ముఖ్యమంత్రి సమక్షంలో టిడిపిలో చేరబోతున్నారు.

    ఇంతకు ముందు ఆమె టిడిపిలోనే ఉండేవారు. టిడిపి పోలిట్‌బ్యూరో సభ్యురాలిగా కూడా పనిచేశారు. అయితే పార్టీలో తనను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆమె గత ఎన్నికలకు ముందు వైకాపాలో చేరి 'పామర్రు' నుంచి  ఎమ్మెల్యేగా గెలిచారు. అప్పట్లో ఆమె టిడిపి అభ్యర్థి 'వర్లరామయ్య'పై గెలిచారు. ఆమె గెలిచిన దగ్గర నుంచి పార్టీ మారతారని వార్తలు వచ్చినా అవి కొలిక్కిరాలేదు. చివరకు ఇప్పుడు ఆమె వైకాపాను వదలి టిడిపిలో చేరబోతున్నారు. ఇప్పుడు ఆమె దారిలోనే మరో ఇద్దరు ఎమ్మెల్యేలు టిడిపిలోకి జంప్‌ చేసేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. వారిలో 'నూజివీడు' ఎమ్మెల్యే మేకా వెంకటఅప్పారావు ఒకరు కాగా మరొకరు 'తిరువూరు' ఎమ్మెల్యే 'రక్షనిధి'. కాగా 'మేకా' పార్టీ మారతారంటూ చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతుంది. అయితే అది ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వచ్చింది. 

   ఇప్పుడు 'కల్పన' పార్టీ మారనున్న నేపథ్యంలో ఆయన కూడా వైకాపాను వీడేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారట. 'మేకా'కు మరో ఎమ్మెల్యే 'రక్షనిధి' కూడా తోడయ్యారని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. వీరు కూడా వైకాపాను వీడితే ఆ పార్టీకి 'కృష్ణా'లో చావుదెబ్బ తగిలినట్లే...! గత ఎన్నికల్లో గెలిచిన ఐదుగురిలో వీరు ముగ్గురు కూడా వెళ్లిపోతే చివరకు మిగిలేది 'కొడాలి నాని' మాత్రమే. ఆయన కూడా టిడిపిలో చేరాలని గత కొన్నాళ్ల నుంచి విశ్వప్రయత్నం చేస్తున్నా అధినేత 'చంద్రబాబు' తిరస్కరిస్తున్నారట. దీంతో 'జగన్‌' 'నాని'ని పెట్టుకుని 'కృష్ణా' జిల్లాను ఈదుకు రావాల్సిందే. మరి ఆయన కూడా 'వైకాపా'లో ఉంటారా...? లేక 'చంద్రబాబు' కాళ్లు పట్టుకుని టిడిపిలో చేరతారా? వేచి చూడాల్సిందే...!


(2368)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ