WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'మెగాస్టార్‌'కు చుక్కలు చూపిస్తున్న 'శాతకర్ణి'...!

దాదాపు పది సంవత్సరాల తరువాత బాక్సాఫీస్‌ ముందు వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవికి 'హిందూపూర్‌' ఎమ్మెల్యే బాలకృష్ణ చుక్కలు చూపిస్తున్నాడట. సంక్రాంతికి 'బాలయ్య'తో పోటీకి దిగుతున్న 'చిరంజీవి' అప్పుడే ట్రైలర్‌లో ఓడిపోయాడని 'బాలయ్య' అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీనంబర్‌150', బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' బాక్సాఫీస్‌ ముందు పోటీపడుతున్నాయి. ఈ రెండు సినిమాలు సంక్రాంతికి రిలీజ్‌ కాబోతున్నాయి. ఇద్దరికీ ఈ సినిమాలు ప్రతిష్టాత్మకమే. 'చిరంజీవి'కి మరీ ప్రతిష్టాత్మకం...ఆయన దాదాపు దశాబ్దం తరువాత తీస్తున్న సినిమా కావడంతో దానిపై భారీ అంచనాలే నెలకొన్నాయి. 

   మొదట్లో 'శాతకర్ణి' సినిమా గురించి 'మెగా కాంపౌండ్‌' తక్కువగా అంచనా వేసిందట. చారిత్రక కధాంశం అయిన 'గౌతమీపుత్రశాతకర్ణి' తమకు అసలు పోటీనే కాదనుకున్నారట. అయితే 'గౌతమీపుత్రశాతకర్ణి' సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయిన తరువాత  అసలు విషయం వారికి బోధపడిందట. చారిత్రక కథాంశం అయినా దాన్ని తెరకెక్కించిన తీరుతో 'చిరు' క్యాంప్‌కు వణకుపుట్టిస్తుందట. గతంలో ఒకసారి సంక్రాంతికి 'బాలయ్య'తో పోటీపడి తలబొప్పికట్టించుకున్న 'చిరంజీవి'కి మరోసారి అటువంటి అనుభవమే ఎదురుకానుంది ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. అప్పట్లో 'నరసింహనాయుడు' 'మృగరాజు' సినిమాలు పోటీపడ్డాయి. దీనిలో 'నరసింహనాయుడు' సూపర్‌డూపర్‌ హిట్‌ కొట్టగా 'చిరంజీవి' 'మృగరాజు' బాక్సాఫీస్‌ దగ్గర బోల్తా కొట్టింది. ఈ నేపథ్యంలో మళ్లీ ఇప్పుడు 'ఖైదీనెంబర్‌150' 'శాతకర్ణి'లో ఎవరిది విజయం సాధిస్తుందో అని తెలుగు ఇండస్త్రీ మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. కాగా 'శాతకర్ణి' ట్రైలర్‌ విడుదల తరువాత 'ఖైధీనెంబర్‌ 150' కంటే దానిపైనే ఇండస్ట్రీలో ఎక్కువ చర్చ జరుగుతుందట.

(220)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ