WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

30న 'కాజల్‌' 'ఎంతవరకు ఈ ప్రేమ' విడుదల...!

'జీవా, కాజల్‌ జంటగా నటించిన 'ఎంతవరకు ఈ ప్రేమ' సినిమా డిసెంబర్‌30వ తేదీన విడుదల కాబోతోంది. తమిళంలో 'కావలైవేండం' సినిమానే తెలుగులో 'ఎంతవరకు ఈ ప్రేమ' పేరుతో అనువదించి విడుదల చేస్తున్నారు.  నిర్మాత మాట్లాడుతూ ''రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన చిత్రమిది. జీవా నటనతోపాటు కాజల్‌ అందచందాలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. పాటలకు, ట్రైలర్‌లకు చక్కని స్పందన వస్తుంది. 'రంగం' తరహాలో జీవాకు మంచి హిట్‌ అవుతుంది'' అని అన్నారు.

(248)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ