WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సానుభూతి కోసమే 'సోమిరెడ్డి' అప్పుల నాటకం...!

నెల్లూరు జిల్లా తెలుగుదేశం రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన రాజకీయాలు సాగుతున్నాయి. రోజు రోజుకు ప్రభుత్వ ప్రతిష్టను,పార్టీ ప్రతిష్టను నాయకులు మంటగలుపుతున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్‌ ఎవరికీ అందుబాటులో ఉండటం లేదు. కనిపిస్తే చూసీ..చూడనట్లు వెళుతున్నారు. ఫోన్‌ చేస్తే పలకరు. జిల్లాలో తానే సుప్రీం అన్న విధంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ జిల్లాకు చెందిన మున్సిపల్‌ మంత్రి నారాయణతో రవిచంద్రయాదవ్‌ కలిసిమెలసి ఉంటున్నారు. జిల్లాలో ఏపని కావాలన్నా మంత్రికి, అధ్యక్షుడికి తెలియకుండా జరగడం లేదు. మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిది ఒట్టిఒట్టి హడావుడే. ముచ్చటగా మూడుసార్లు ఓడిపోయి ఓటమి హ్యాట్రిక్‌ వీరునిగా రాజకీయనాయకులు పిలుచుకుంటున్నారు. మంత్రి పదవి ఎప్పుడు వస్తుందా..?అని ఆశగా ఎదురు చూస్తున్నారు. విచిత్రమైన ఆయన మానసిక పరిస్థితి ఏమిటంటే తెలుగుదేశం పార్టీకి సానుభూతిపరులైన అధికారులు, ఉద్యోగులను 'సోమిరెడ్డి' చిన్నచూపు చూస్తారాట. ఆ చిన్నచూపుపై ఆగ్రహం చెందిన వారు 'చినబాబు'ను కలసి 'సోమిరెడ్డి'పై ఆధారాలతో ఫిర్యాదు చేశారు. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలిసింది. వారిద్దరినీ తృప్తి పరిచేందుకు 'సోమిరెడ్డి' 'జగన్‌'పై విమర్శలు చేస్తుంటారు. దీంతో వారిద్దరి దృష్టిని ఆయన మళ్లించగలిగారు. 

     ఇటీవల ఆయనపై విజయం సాధించిన 'జగన్‌' పార్టీ ఎమ్మెల్యే గోవర్థన్‌రెడ్డి బాహాటంగా అవినీతి ఆరోపణలను చేస్తూ ఆధారాలతో కూడిన వీడియోను కూడా విడుదల చేశారు. 'సోమిరెడ్డి'కి వెయ్యికోట్లు ఆస్తులు ఉన్నాయని 'గోవర్థన్‌రెడ్డి' విమర్శలు చేసినా ఆయా ఆస్తుల విలువ వందల కోట్లు ఉంటుందని ఆయన బయటపెట్టిన వీడియో సాక్ష్యాలను బట్టి పలువురు అంచనా వేస్తున్నారు. తాను అప్పుల్లో ఉన్నానని నిన్నటి వరకు చెప్పుకుని ప్రజాసానుభూతి పొందేందుకు ప్రయత్నించారు. తాజాగా ఆ వీడియో టేపులు 'సోమిరెడ్డి'కి శాపంగా మారాయి. ఇక మంత్రి పదవిపై ఆయన పూర్తిగా ఆశలు వదలుకున్నారట. బీసీల్లో పట్టుసాధించలేకపోతున్నారు అధ్యక్షుెడు బీదరవిచంద్రయాదవ్‌. అధికారంతో ఆర్థికపరంగా ఎదుగుతూ ముందుకు దూసుకెళ్తున్నారు. 

    జిల్లాలో బలిజ సామాజికవర్గ ఓటర్లను ప్రభావితం చేయడంలో ఆ సామాజికవర్గానికి చెందిన మంత్రి నారాయణ ఘోరంగా విఫలమయ్యారు. 'రెడ్డి' సామాజికవర్గంలో మెజార్టీ ఓటర్లు 'జగన్‌'కే మద్దతు ఇస్తున్నారని...వారిని ఆకర్షించడంలో అధికారపార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకులెవరూ ప్రయత్నించడం లేదని వార్తలు వస్తున్నాయి. ప్రజల్లో మద్దతు ఉన్న మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్‌రెడ్డిని పూర్తిగా రాజకీయంగా తెరపైకి తేవాలని పలువురు నాయకులు కోరుతున్నారు. కేవలం పదివేల ఓట్ల తేడాతో ఎంపిగా ఓడిపోయిన 'ఆదాల'ను ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు చేరదీయకుండా 'సోమిరెడ్డి'ని నమ్ముతున్నారు. 'ఆదాల' ఏ పార్టీ నాయకులనూ ఎప్పుడూ విమర్శించలేదని, అదే 'సోమిరెడ్డి' అయితే తనపై ఈగ వాలనివ్వకుండా విమర్శకులపై ఎదురుదాడి చేస్తారని 'చంద్రబాబు' నమ్మకం. విమర్శలు చేసే వారి కన్నా ప్రజల్లో పట్టుఉండే నాయకులను చేరదీయకుండా ప్రజా వ్యతిరేకతతో పాటు వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారికి ఎమ్మెల్సీ పదవి, విద్యావ్యాపారికి 'నారాయణ'కు మంత్రి పదవి ఇస్తే పరిస్థితి ఇలా ఉంటుందని అనుభవంతో తెలుసుకున్న 'చంద్రబాబు' దాన్ని సరిచేసేందుకు ప్రయత్నించడం లేదు.


(364)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ