WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'తప్పు చేస్తే...చీరేస్తారు...'చింతమనేని'...!

ఆయన అధికారపార్టీ ఎమ్మెల్యే. అసెంబ్లీ విప్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆవేశం వస్తే ఎవరినీ లెక్క చేయరు. సామాన్య ప్రజలందరికీ అందుబాటులో ఉండారు. ఆర్థిక పరంగా పలువురిని ఆదుకునే స్వభావం ఆయనది. సిఎం సహాయనిధి ద్వారా లక్షలాది రూపాయలను ఇప్పించారు. ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌ల్లో నిజాయితీగా వ్యవహరిస్తారని పేరు ఉంది. కానీ ఆయన నియోజకవర్గంలో వివిధ హోదాల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులపై కార్యకర్తలు కానీ, ప్రజలు కానీ ఫిర్యాదు చేస్తే అప్పటికప్పుడు స్పందిస్తారు. సంబంధించిన వారి ప్రజాదర్బార్‌కు పిలిపిస్తారు. వారందరి ముందే వారిని కడిగి పారేస్తారు. 'మీరు నా కోసం పనిచేయవద్దు...ప్రజల కోసం పనిచేయండి...అని వారిపై కేకలు వేస్తారు. 'మా నాయకుడు 'చంద్రబాబు'రోజుకు 18గంటలకు పైగా పనిచేస్తున్నారు...నేను కూడా ఆయన బాటలోనే పనిచేస్తూ అందరికీ అందుబాటులో ఉంటూ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను..మీకు కూడా ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలను కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది అని గట్టిగా చెబుతారు. ఆయన ఎవరో కాదు...దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌. గ్రామ స్థాయి నుండి మండల స్థాయి వరకు అధికారులు, ఉద్యోగులు 'ప్రభాకర్‌' ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటిస్తారు. నిత్యం ప్రజాదర్బార్‌ నిర్వహించి ప్రజా సమస్యలను తెలుసుకుంటారు. అప్పటికప్పుడే ఉద్యోగులను, అధికారులను అక్కడికి పిలిపించి ఆయా సమస్యలను పరిష్కరించమని చెబుతారు. ఆయన ఇసుక, మట్టి వ్యాపారాల ద్వారా కోట్లు గడించారని విపక్షనాయకులు విమర్శలు చేసినా...ప్రభాకర్‌ ఖాతరు చేయరు. ఒకవేళ ఆవిధంగా సంపాదించినా...అందులో కొంత సొమ్మును కార్యకర్తల కోసం ఖర్చు చేస్తారు. 'నాకీ బాధ ఉంది...మీరు ఆదుకోవాలి అంటే...వెంటనే ఎంతో కొంత సొమ్మును అందచేయడంలో 'ప్రభాకర్‌' అందరికన్నా ముందుంటారు. అందుకే ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తం కావడం లేదు. అధికారులు, ఉద్యోగులు, సామాన్య ప్రజల దగ్గర తన మనుషులు ఎవరైనా లంచాలు తీసుకోవడం తెలిస్తే ఆయన సహించరు. ఏయే వ్యాపారం ద్వారా ఎన్ని కోట్లు ఆయన సంపాదిస్తే ఎవరికైనా నష్టం కల్గిందా...? ఆర్థిక పరంగా ఆదుకుంటారు...బీదవారికి అడిగింది కాదనకుండా ఇస్తున్నారు. ఆయనకు కోపం ఎక్కువ...అంతే కానీ...జనాన్ని మోసం చేసి, అధికారులను బెదిరించి లంచాలు తీసుకునే అల‌వాటు ఆయనకు లేదు. 'ప్రభాకర్‌' పలువురిని చంపించారని విపక్షాలు చేస్తున్న విమర్శలను ఆ నియోజకవర్గ ప్రజలు నమ్మడం లేదు...ఆరోపణలును తోసిరాచని ఆయనకే మద్దతుగా నిలుస్తున్నారు. తన నియోజకవర్గ పరిధిలోని ఏ అధికారి అయినా, ఉద్యోగి అయినా ప్రజల కోసం కష్టపడాల్సిందేనని గట్టిగా చెబుతుంటారు తప్ప...వారినీ ఏ విధంగా ఇబ్బంది పెట్టరని పార్టీ కార్యకర్తలు చెబుతున్నారు.

(865)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ