WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'లోకేష్‌' చేస్తే ఒప్పా...?...మావాళ్లు చేస్తే..తప్పా...?

మంత్రుల కుమారులు, సోదరులు, అఇతర బంధు మిత్రులు అధికారం చెలాయిస్తూ కోట్లు గడిస్తున్నారని వస్తున్న విమర్శలపై కొంత మంది మంత్రులు ఆఫ్‌ ది రికార్డుగా స్పందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కుమారుడు లోకేష్‌ అధికారం చెలాయించడం లేదా...? లంచాలు తీసుకోవడం లేదా...? మా వాళ్లు కూడా అధికారం చెలాయించినా లంచాలు తీసుకున్నా తప్పేమిటని...ఎదురుదాడి చేయడం అధికారపార్టీలో చర్చనీయాంశంగా మారింది. పదమూడు జిల్లాల నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రుల్లో ఎక్కువ మంది మంత్రుల కుమారుల రాజకీయ, అధికార ప్రమేయంపై విపక్షాల నాయకులు విమర్శలు గుప్పించినా మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు. చాలా మంది 'జగన్‌' పార్టీ నాయకులు, అధికారపార్టీ ప్రముఖులతో మంత్రులతో తెరవెనుక లాలూచీపడి...మొక్కుబడిగా విమర్శలు చేస్తున్నారే తప్ప...ఆధారాలతో విమర్శలు చేయకపోవడం విశేషం. రాష్ట్రస్థాయిలో 'చంద్రబాబు' కుమారుడు అధికారం చెలాయిస్తున్నారు..జిల్లాస్థాయి మా కుమారులు అధికారం చెలాయిస్తే తప్పేమిటి...? 'లోకేష్‌' భవిష్యత్‌ ముఖ్యమంత్రి...అమా కుమారులు ఆయన మంత్రివర్గంలో మంత్రులుగా ఉంటారు. మీ కుమారులు అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారు కదా...అని ఎవరైనా అడిగితే  మంత్రుల, ఎమ్మెల్యేల ఇతర ప్రముఖుల పుత్రులు అక్రమంగా సంపాదించుకోలేదా..? మా కుమారులపై విమర్శలు చేసే అర్హత వారికి ఉందా...? అప్పుడు వాళ్లపై మేము ఆరోపణలు చేశాం..ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాం కనుక..మాపై వారు విమర్శలు చేస్తున్నారు. 

  మా కుమారులు అందరికీ ఆదర్శం...చంద్రబాబు కుమారుడు 'లోకేషే' అని కొంత మంది మంత్రులు చెబుతున్నది యధార్థమేనని జరిగిన కొన్ని సంఘటనలు స్పష్టం చేస్తున్నాయి. 'లోకేష్‌' కూడా మంత్రుల కుమారులతో సమావేశం అవుతూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు. లంచాలు తీసుకోనిది ఎవరు...? ఎవరి స్థాయిలో వారు తీసుకుంటూనే ఉన్నారు..అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ నాయకులు...ఇప్పుడు టిడిపి నాయకులు...అని ప్రజల్లో అభిప్రాయం బలంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మంత్రి కుమారుల అక్రమ సంపాదనపై ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ముఖ్యమంత్రి చంద్రబాబుకు అనేకసార్లు నివేదిక రూపంలో అందచేసినా ఇంత వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కలెక్టర్లు, ఎస్పీలల్లో కొందరు లంచాలు తీసుకోవడం లేదా...? అని మంత్రులు, మంత్రుల కుమారులు పరోక్షంగా విమర్శిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో 'లోకేష్‌' అవినీతికి పాల్పడుతున్నారని 'జగన్‌' పార్టీ నాయకులు చేసిన ఆరోపణలకు ఆధారాలు లేకపోయినా...జిల్లా స్థాయిలో మంత్రుల కుమారులు చేసే అవినీతికి ఆధారాలు ఉన్నా...ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. మంత్రుల అవినీతి అక్రమాలపై 'చంద్రబాబు' కఠినంగా వ్యవహరించడం లేదు. అదే విధంగా మంత్రుల వారసులపై 'లోకేష్‌' కఠినంగా వ్యవహరించడం లేదు. వారిద్దరికీ కావాల్సింది మళ్లీ అధికారమే. కోట్లు ఉంటేనే కదా..ఎన్నికల్లో గెలిచేది అని తండ్రీ కొడుకుల అభిప్రాయం.

(382)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ