WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

సముద్రంలో కుప్పకూలిన 'రష్యా' విమానం...!

వాళ్లంతా నూతన సంవత్సర వేడుకల కోసం సిరియాలోని రష్యా సైనిక బృందాన్ని ఉత్సాహపరచడానికి విమానంలో ప్రయాణిస్తున్నారు. విమానం టేకాఫ్‌ అయిన 20 నిమిషాల్లోనే నల్లసముద్రంలో కూలిపోయిందా విమానం. విమానంలో ఉన్న దాదాపు 91మంది జలసమాధి అయినట్లు వార్తలు వస్తున్నాయి. వివరాల్లోకి వెళితే సిరియాలోని లటాకియా ప్రావిన్స్‌కి వెళ్లేందుకు సోచి ప్రాంతం నుంచి టేకాఫ్‌ అయిన టీయూ-154 విమానం బయలుదేరిన 20 నిమిషాల్లోనే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. విమానం కోసం గాలింపు చర్యలు చేపట్టిన సహాయ బృందాలు నల్ల సముద్రానికి 1.5 కిమీల దూరంలో విమాన శకలాలు గుర్తించారు. విమానంలో అలెక్జోండ్రోవ్‌ మిలిటరీ బ్యాండ్‌ బృందం, తొమ్మిది మంది రిపోర్టర్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు.రష్యా రాజధాని మాస్కో నుంచి బయలుదేరిన విమానం ఇంధనం నింపుకునే నిమిత్తం సోచిలో ల్యాండ్‌ అయింది. విమానం ప్రయాణిస్తున్న సమయంలో వాతావరణం కూడా అనుకూలంగానే ఉన్నట్లు అధికారులు తెలిపారు.  

(317)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ