WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

రూ.999కే విమాన ప్రయాణం...!

2016 సంవత్సరాంతపు ప్రయాణ తగ్గింపు ధరలను ఎయిర్‌వేస్‌ సంస్థలు భారీగా ప్రకటించాయి. దీనిలో భాగంగా దేశీయ విమాన టికెట్‌ను కేవలం రూ.999/-కే అందించనున్నట్లు 'గో ఎయిర్‌', ఇండిగో, ఎయిర్‌ ఏసియా సంస్థలు ప్రకటించాయి. 'గో ఎయిర్‌ ప్రకటించిన ఆఫర్‌ ప్రకారం జనవరి 9 2017, ఏప్రిల్‌ 15, 2017 మధ్య ప్రయాణించే వారు తమ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని తెలిపింది. ఈ ఆఫర్‌ డిసెంబర్‌ 31 వరకు అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. అయితే ఎన్ని సీట్లు ప్రయాణీకులకు అందుబాటులో ఉంటాయో మాత్రం సంస్థ చెప్పలేదు.మరోపక్క ఇండిగో సైతం రూ.999కే విమాన టికెట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే కేవలం ఈ ఆఫర్‌ డిసెంబర్‌ 25 వరకు అదీ హైదరాబాద్‌-బెంగళూరు రూట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. జయపుర-పుణె మధ్య రూ.2,317.. దిల్లీ-గువహటి మధ్య రూ.2,534.. దిల్లీ-గోవా మధ్య రూ.3,116లుగా టికెట్‌ ధరలను నిర్ణయించారు.ఎయిర్‌ ఏషియా సైతం ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని రూ.917కే టికెట్‌ను పొందవచ్చు.  

(127)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ