WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సల్మాన్‌' ముసలోడే కానీ...!

బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ 'సల్మాన్‌ఖాన్‌'పై 'ట్వింకిల్‌ ఖన్నా సెటైర్లు వేసింది. 'సల్మాన్‌ఖాన్‌' ముసలివాడట. అయినా మంచి పనిమంతుడని...ఆయన పెళ్లి చేసుకోవడానికి మంచి అమ్మాయి కావాలని ట్వింకిల్‌ ట్విట్టర్‌లో పోస్టు పెట్టింది. 'దేశం'లోనే అత్యంత ముసలోడు..మోస్ట్‌ ముదిరిపోయిన బ్యాచిలర్‌ అయిన ఓ వ్యక్తికి మంచి సంబంధం కావాలి. ఆయన మంచి పనిమంతుడు, బుద్దిశాలి, బలవంతుడు, నాన్‌వెజిటేరియన్‌, కండలు తిరిగిన వ్యక్తి మంచి సాంప్రదాయ కుటుంబానికి చెందిన సన్నని నడుము ఉన్న అమ్మాయి కావాలి. అని ఆమె ప్రకటన ఇచ్చారు. ఆమె ప్రకటన ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. మనసులో ఏముందో అదే బయటకు అనేసే ట్వింకల్‌ ఖన్నా గతంలో చాలా మంది పాపులర్‌ వ్యక్తులపై సెటైర్లు వేసింది. ప్రముఖ జర్నలిస్టు ఆర్నాబ్‌గోస్వామి, నరేంద్రమోడీ వంటి వారిపై కూడా బాణాలు వేసింది. తాజాగా ఆమె జాబితాలో 'సల్లూభాయ్‌' చేరాడు.


(219)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ