WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పవన్‌' పంచెకట్టు...'పరిటాల'దే...!

'పవర్‌స్టార్‌' 'పవన్‌కళ్యాణ్‌' తాజాగా నటిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. ఈ చిత్రంలో ఆయన రాయలసీమ ఫ్యాక్షనిస్టుగా కనిపించబోతున్నారట. 'రాయలసీమ' ఫ్యాక్షనిస్టుగా 'పవన్‌' కనిపిస్తున్న చిత్రం టీజర్‌ ఫ్రీలుక్‌ పోస్టర్‌ను నిన్న విడుదల చేశారు. ఇప్పుడు ఈ పోస్టర్‌ సంచలనం సృష్టిస్తోంది. 'పవన్‌' లుంగీతో కనిపిస్తున్న ఈ చిత్రంలో దివంగత టిడిపి నేత 'పరిటాల రవి'ని పోలి ఉందని ఆయన అభిమానులు, సినిమా విశ్లేషకులు పేర్కొంటున్నారు. చిత్రం పోస్టర్‌లో 'పవన్‌' పంచెకట్టిన తీరు 'పరిటాల'ను గుర్తుకు తెస్తుందని కొంత మంది 'పరిటాల' అభిమానులు చెబుతున్నారు. తమ నాయకుడు కూడా అదే విధంగా పంచెలో కనిపిస్తారని, ఇప్పుడు 'కాటమరాయుడు' బృందం విడుదల చేసిన పోస్టర్‌ కూడా అదే విధంగా ఉందని వారు అంటున్నారు. సాదా సీదా చెప్పులు, లుంగీ పైకి ఎగకట్టి సేధ్యం చేయడం 'పరిటాల' స్టైల్‌. మరి అదే స్టైల్‌ను 'కాటమరాయుడు'కు వాడారని వారు చెబుతున్నారు. మొత్తం మీద 'పరిటాల'ను పోలి ఉండడం సంచలనాలకు తావిస్తోంది. 

  తమిళంలో హిట్‌ అయిన 'వీరమ్‌' కథను 'కాటమరాయుడు'గా రీమేక్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి 'కిశోర్‌ పార్థసాని' దర్శకత్వం వహిస్తుండగా, 'శరత్‌మరార్‌' నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజగా విడుదల చేసిన ఫ్రీలుక్‌ పోస్టర్‌ను పూర్తి స్థాయిలో డిసెంబర్‌ 31 అర్థరాత్రి 'పవన్‌' అభిమానుల కోసం విడుదల చెయ్యబోతున్నారట. చూద్దాం..ఈ చిత్రం ఎంత సంచలనం సృష్టిస్తుందో...?
(886)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ