WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'పాపం..'రేష్మి'...!

'గుంటూర్‌ టాకీస్‌' అంటూ ఆ మధ్య వచ్చిన సినిమాలో 'జబర్ధస్త్‌' యాంకర్‌ 'రేష్మి' తన అందాలను ఆరబోసి ప్రేక్షకుల మతి పోగొట్టిన విషయం తెలిసిందే కదా..! ఆ సినిమా నిర్మాతలకు లాభాలు తెచ్చిపెట్టిందంటే అది 'రేష్మీ' చలువే. అటువంటి 'రేష్మీ'ని 'గుంటూర్‌ టాకీస్‌-2' సినిమాలో హీరోయిన్‌గా తీసుకోమని నిర్మాతలు తేల్చి చెప్పారట. కుర్రకారులో విపరీతమైన ఫాలోయింగ్‌ ఉన్న 'రష్మి'ని మరి నిర్మాతలు ఎందుకు వద్దనుకున్నారో ఇంకా తెలియడం లేదు. అయితే 'రష్మి' అడుగుతున్న భారీ రెమ్యూనరేషనే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే 'రేష్మి' వద్దనుకున్న నిర్మాతలు ఇప్పుడు బ్లూఫిలిమ్‌ తార 'సన్నిలియోన్‌' ఈ సినిమా కోసం ఎంపిక చేశారట. ఆమెతో పాటు బొద్దుభామ 'నమిత', నికితా పటేల్‌లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారట. 'రేష్మి' అడిగినంత రెమ్యూనరేషన్‌ ఇవ్వని నిర్మాతలు మరి బ్లూఫిల్మ్‌ నటికి భారీ మొత్తంగానే సమర్పించుకుంటున్నారట. ఎంతైనా బ్లూఫిల్మ్‌ యాక్టర్‌ కదా...! ఆ మాత్రం డిమాండ్‌ ఉంటుంది..పాపం 'రేష్మి'...!


(290)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ