WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'భర్త' ఆమెనేం కోరాడో తెలుసా...?

వాళ్దిద్దరూ స్టాఫ్‌వేర్‌ ఇంజనీర్లు. ఇద్దరికీ కలిపి  నెలకు ఐదులక్షలకు పైగా జీతం వస్తుంది. స్వంత ప్లాట్‌ ఉంది. ఓ చిన్నపాప కూడా ఉంది. చీకూ చింతలేని జీవితం...! అయినా భర్తకు ఏదో అసంతృప్తి. తన జీవితంలో ఏదో కోల్పోతున్నామనే భావన. దీని కోసం ఏమి చేయాలని అన్వేషించాడు..అతని అన్వేషణ ఫలించి ఒక సాధువు అతని కళ్లు తెరిపించాడు. జీవితం స్వాతికంగా సాగాలంటే చేయాల్సిన చిట్టా విప్పాడు. మనోడు అతను చెప్పిన చిట్టాను అక్షరాలా అమలు చేశాడు. ఇక అక్కడ నుంచి మొదలైంది..మనోడు జీవితంలో ఇంతకు ముందు పదురుకాని కొత్త కష్టాలు ఎదురయ్యాయి. సాధువు చెప్పినట్లు మందు మానేస్తే స్నేహితుల్లో చులకనయ్యాడు.. మాంసాహారం మానేస్తే భార్య, కూతురు విసుకొంటున్నారు. 

  ఉదయాన్నే లేచి వాకింగ్‌, యోగా చేస్తే ఈ డిస్ట్రబ్‌ ఏమిటని ఇంట్లో ఒకటే సతాయింపు.సాధువు చెప్పిన స్వాతిక జీవనం అంత ఈజీ కాదనే విషయాన్ని స్వతరమే గుర్తించాడు. అయినా ఆయన మార్గంలోనే వెళ్లాలని భావించి వాటిని కష్టంగా అమలు చేయడం ప్రారంభించాడు. దీంతో ఇతనితో బతకడం తన వల్ల కాదని...తనకు విడాకులు ఇప్పించాలని భార్య కోర్టుకెక్కింది. దాంతో పాటు స్నేహితులు సతాయింపు...నిన్నటి దాకా హాయిగా గడిచిన జీవితం స్వాతిక జీవితంపై మోజు పెంచుకున్నాక కష్టాల కడలిలో చిక్కుకున్నాని ఆయన వాపోతున్నారు. మొత్తానికి ఒక్కసారిగా జీవితంలో మార్పులు తెస్తే ఇంతే అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.


(313)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ