WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టిటిడి ఇఒ 'సాంబశివరావు' బదిలీ...!

టిటిడి ఇఒ నిన్నటి వరకు ఒకే సామాజికవర్గానికి చెందిన వారే బాధ్యతలను నిర్వహించారు. దీంతో ఆ సామాజికవర్గానికి చెందిన ఉద్యోగులు, పూజారులు మిగతా వారిపై సవారీ చేశారు. బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన పూజారులు నిబంధనలకువిరుద్ధంగా ఎన్ని తప్పులు చేసినా, సకాలంలో కార్యాలయానికి రాకుండా, బాధ్యతలు సరిగా నిర్వహించకుండా వ్యవహరిస్తున్నా ఇంత వరకు ఎవరిపైనా చర్యలు తీసులేదు. బ్రాహ్మాణేతర సామాజికవర్గానికి చెందిన సాంబశివరావును టిటిడి ఇఒగా నియమించడంతో పరిస్థితి తారుమారైంది.నిజాయితీ, సమర్థతో పాటు ముక్కుసూటిగా నిర్ణయాలు తీసుకునే సాంబశివరావు ముందు ఏ సామాజికవర్గానికి చెందిన నాయకుల పప్పులు ఉడకడం లేదు. దీంతో ఆయనను ఇఒ బాధ్యతల నుండి తప్పించాలని రిటైర్డ్‌ మాజీ ఇఒ, మాజీ ఐఎఎస్‌ అధికారి పివిఆర్‌కె ప్రసాద్‌, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మరియు బ్రాహ్మణ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ ఐవైఆర్‌ కృష్ణారావు దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి జెఎస్‌వి ప్రసాద్‌, దేవాదాయశాఖ కమీషనర్‌ అనురాధలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. వీరంతా బ్రహ్మణవర్గానికి కొమ్ముకాయడంలో ముందున్నారు. బ్రాహ్మణేతర వర్గాలకు చెందిన వారెవరైనా చిన్నపాటి తప్పులు చేస్తే బూతద్దంలో చూసినట్లుగా అతిగా స్పందించే ఈ నలుగురు తమ సామాజికవర్గానికి చెందిన వారు ఎన్ని దురాగతాలు చేసినా, విధులకు గైర్హాజరు అవుతున్నా, వ్యవస్థను బ్రష్టుపట్టిస్తున్నా, సాంప్రదాయాలను దిగజారుస్తున్నా...వీరు స్పందించరు. ఈ నేపథ్యంలో వీటన్నింటిని గమనించిన ఈఒ సాంబశివరావు ఒక్కో సమస్యను తెలుసుకుని పరిష్కాలను అమలు చేశారు. సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనం సులువుగా అయ్యేటట్లు వ్యవహరించారు. 

    నిన్నటి వరకు తిరుమలో ఉచితభోజన వసతి మాత్రమే ఉండేది...ఇప్పుడు ఉదయాన్నే అల్పాహారం కూడా అందించే కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. శ్రీవారిని దర్శించుకునేందుకు గంటల తరబడి  క్యూలైన్‌ల్లో నిలబడేవారికి ఉచితంగా అల్పాహారం, పాలు సరఫరా చేయడంలో ఇఒ సాంబశివరావు అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల గర్భగుడిలోకి ప్రధాన అర్చకుడు రమణద్షీతులు తన మనవడ్ని సాంప్రదాయాలకు విరుద్ధంగా లోకి తీసుకెళ్లి అపవిత్రం చేయించారు. ఈ సంఘటను అక్కడే ఉన్న డిప్యూటీ ఇఒ రామారావు కళ్లారా చూసి దానిపై ఇఒకు ఫిర్యాదు చేయకుండా వదిలేశారు. తిరుమల జెఇఒ శ్రీనివాసరాజు కూడా ఈ విషయం తెలిసినా తెలిసీ తెలియనట్లు వ్యవహరించారు. ఆ నోటా..ఈ నోటా బడి అది బయటకు వచ్చింది. దీంతో ఆ సంఘటనపై వాస్తవాలను నివేదిక రూపంలో తనకు అందజేయాలని డిప్యూటీ ఇఒ రామారావును ఇఒ సాంబశివరావు  ఆదేశించినప్పటికీ ఆయన భయపడుతున్నారని ఉద్యోగ వర్గాలు చెప్పుకుంటున్నాయి. దీంతో 'రమణదీక్షితుల'పై చర్య తీసుకుంటే తమ సామాజికవర్గ ప్రతిష్ట ఎక్కడ మంట గలుస్తుందోనన్న భయంతో మాజీ ఇఒలు ప్రసాద్‌, కృష్ణారావులు వారిద్దరికి తోడుగా దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి ఆ శాఖ కమీషనర్‌లు 'సాంబశివరావు'ను బదిలీ చేయించే ప్రయత్నాలు ప్రారంభించారని ప్రచారం జరుగుతోంది. శ్రీవారి గర్భగుడిని అపవిత్రం చేసినా, ఖరీదైన కానుకల కోసం యజ్ఞయాగాదులకు హాజరైనా, ఆయన ముగ్గురు కుమారులు విధులకు సక్రమంగా రాకున్నా గైర్హాజరు అవుతున్నా, ఎటువంటి చర్యలు తీసుకోకూడదనేది ఈ నలుగురి అభిప్రాయమట. సాంప్రదాయాల కన్నా, కులం ముఖ్యమా..? ఎటుపోతున్నారు..ఈ నలుగురు అని అధికారవర్గాల్లో చర్చ జరుగుతోంది.   

 ఇటీవల సాంబశివరావు బదిలీ అవుతారని కొందరు ప్రచారం చేసినప్పటికీ అటువంటి ప్రతిపాదన ఏమీ లేదని, ఆయనపై ఇంత వరకు చర్చ కూడా జరగలేదని, ప్రభుత్వ ముఖ్యులు ఒకరు 'జనం ప్రతినిధి'కి తెలిపారు. ఈ నేపథ్యంలో 'సాంబశివరావు' బదిలీ కష్టసాధ్యమని తెలుసుకున్న పై నలుగురు ఆయన నుంచి 'రమణ''ను ఎలా కాపాడాలా? అనే దానిపై పథకాలు రచిస్తున్నారట. 'అంబానీ' వంటి పారిశ్రామికవేత్తతో పాటు ఇతర పారిశ్రామికవేత్తలు, సుప్రీంకోర్టు జడ్జిలతో పరిచయాలు ఉన్న 'రమణ' తనపై చర్య తీసుకోకుండా వీరి ద్వారా వత్తిడి తెస్తారని టిడిపి ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. శ్రీవారి దర్శనాల టిక్కెట్ల కేటాయింపులో ఇఒ సాంబశివరావు దృష్టిసారించకపోయినప్పటికీ మిగతా అన్ని విషయాలపై ఆయనకు పూర్తిస్థాయి పట్టువచ్చింది.వీవీఐపిలకు టిక్కెట్లను ఏ పద్దతిలో జరుపుతున్నారో కూడా ఈఒ సాంబశివరావు పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. వాటి జోలికి మీరు వెళ్లవద్దు అని 'సాంబ'కు సిఎం చెప్పారని టిటిడిలో ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని 'సాంబ' కొట్టిపారేస్తున్నా..? ఆయన సేవా టిక్కెట్లపై దృష్టిసారించడం లేదు. 

   ఎవరెవరు ఏ మార్గాన..ఎంత మంది ఏపద్దతిన శ్రీవారిని దర్శించుకుంటున్నారు..అందుకు కేటాయిస్తున్న సమయం ఎంత? అనే విషయాలపై ఇఒ దృష్టిసారించాలని టిటిడి ఉద్యోగులు కోరుతున్నారు. ఇటీవల తన సామాజికవర్గానికి చెందిన సినీనటుడు ఒకరిని ఎల్‌-1 టిక్కెట్‌ కేటాయించి, అతన్ని శ్రీవారి గర్భగుడిలో పావుగంట సేపు నిలబెట్టడమే కాకుండా, ఇతర భక్తులు ఎవరినీ రానీయకుండా, క్యూలైన్లు జెఇఒ శ్రీనివాసరాజు నిలిపివేయించారట. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన కొందరు మీడియా ప్రతినిధులు ఈఒకు ఫిర్యాదు చేయడం జరిగింది. ఇది యధార్థమేనని తేలడంతో ఈ విషయాన్ని పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తరువాత ఈ సంఘటన ఎందుకో మరుగునపడిపోయింది. తన కుటుంబ సభ్యులకు కూడా సేవా టిక్కెట్లు ఇవ్వని ఇఒ సాంబశివరావు 'తిరుమల'లో ఏం జరుగుతుందో తెలిసినా...ఏమీ చేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇఒ సాంబశివరావుపై ఎవరు ఒత్తిడి తెస్తున్నారో బయటపడనప్పటికీ వారు ప్రముఖులే అయి ఉంటారని టిటిడి వర్గాలు చెప్పుకుంటున్నాయి. సిఎంఒ చెందిన వారే వారని అభిప్రాయపడుతున్నారు. త్వరలో 'రమణ' దీక్షితులపై చర్య తీసుకునే అవకాశాలు ఉండడంతో ముందుగానే 'సాంబ'ను బదిలీ చేయించి బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన జెఎస్వీ ప్రసాద్‌ను టిటిడి ఇఒగా నియమించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి మాజీ ఇఒలు, రిటైర్డ్‌ సిఎస్‌ చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో వేచి చూడాల్సిందే...!


(1063)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ