WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కెవిపి' అంతర్జాతీయ క్రిమినల్‌...!

'పోలవరం ప్రాజెక్టు'పై విమర్శలు చేసిన కాంగ్రెస్‌ ఎంపి కె.వి.రామచంద్రరావుపై జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ అయిన 'కెవిపి'కి ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత లేదని అన్నారు. పోలవరం ప్రాజెక్టు సిల్ప్‌వే,ఎర్త్‌ కం రాక్‌ డ్యామ్‌ పనులను ఎందుకు ఫ్రీ క్లోజ్‌ చేయించారో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కెవిపి, రాజశేఖర్‌రెడ్డిలు ప్రాజెక్టుల పేరుతో దోచుకున్నారని, దోచుకున్న సొమ్మును ఢిల్లీకి వాటాల మూట మోసింది కెవిపీనేని ఆయన ధ్వజమెత్తారు. పోలవరం ప్రాజెక్టులో ఎవరు ఎంత కమీషన్లు తీసుకున్నారో విచారణ జరిపి, పాపులను శిక్షిస్తామని, రాష్ట్ర సొమ్మును అప్పనంగా దోచుకున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్ర విభజనకు 'సోనియా'తో కలసి కుట్ర పన్ని ఆంధ్రాకు 'కెవిపి' అన్యాయం చేశారని, ఆయన పాపాలను త్వరలోనే బయటపెడతామని 'ఉమ' ఘాటుగా హెచ్చరించారు.


(219)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ