WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఖైదీ' క్లైమాక్స్‌పై 'చెర్రీ' అసహనం...!

దాదాపు తొమ్మిదేళ్ల తరువాత 'చిరంజీవి' మళ్లీ ముఖానికి రంగేసుకుని వస్తోన్న చిత్రం 'ఖైదీనెంబర్‌ 150'. ఈ చిత్రాన్ని స్వయంగా ఆయన తనయుడు 'రామ్‌చరణ్‌తేజ్‌' నిర్మిస్తున్నారు. ఈ నెల11న దీన్ని విడుదల చేయాలని ఆయన అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అయితే సినిమా అంతా బాగానే వచ్చిందని...కాకపోయే క్లైమాక్స్‌ మాత్రం నీరసంగా ఉందని 'చెర్రీ' అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తి కాగా...రిలీజ్‌ ఫంక్షన్‌ను భారీగా చేయాలని 'చెర్రీ' భావిస్తున్నారు. నందమూరి బాలకృష్ణ 100వ సినిమా 'గౌతమీపుత్రశాతకర్ణి'కి పోటీగా వస్తోన్న ఈ సినిమా దానికి ఏ మాత్రం తగ్గ కూడదనేది అటు మెగా అభిమానులు...ఇటు 'చెర్రీ' ఆలోచనట. తమిళ రీమేక్‌ అయిన ఈ సినిమా దాని మాతృక రూపంలో లేదట. దాని వలే బాగా రాలేదనేది సినీవర్గాల టాక్‌. కొన్ని సన్నివేశాలను చాలా పేవలంగా చిత్రీకరించారని అంటున్నారు. బ్రహ్మానందం, పోసాని కృష్ణమురళీ పాత్రలు పెద్దగా ఆకట్టుకునే లా లేవని అంటున్నారు. మొత్తం మీద 'బాలయ్య'ను ఢీ కొట్టడానికి ఈ హంగులు చాలవనేది ఫిల్మ్‌వర్గాల అభిప్రాయం. మరి ఏమవుతుందో...చూద్దాం...!


(358)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ