WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'హీరోయిన్‌ 'నమిత'ను వేధిస్తున్న ఇంటిఓనరు...!

ప్రముఖ తమిళ హీరోయిన్‌ 'నమిత'ను ఆమె అద్దెకు ఉంటున్న ఇంటి ఓనరు వేధిస్తున్నారట. ఈ విషయాన్ని ఆమె చెన్నె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా దీనిపై ఆమె కోర్టులో పిటీషన్‌ దాఖలు చేసింది. తాను ప్రతి నెలా ఇంటి అద్దె ఠంచన్‌గా చెల్లిస్తున్నా...ఇంటి ఓనరు తనను ఇళ్లు ఖాళీ చేయమని వేధిస్తున్నారని ఆమె ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. తమిళ్‌, తెలుగు,హిందీ సినిమాల్లో హీరోయిన్‌గా పనిచేసిన 'నమిత' తమిళనాడులోని ఓ రాజకీయ పార్టీకి కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. తాను ప్రతి నెల ఇంటికి రూ.15000/-లు అద్దె చెల్లిస్తున్నానని, ఇప్పటికిప్పుడు హఠాత్తుగా ఇళ్లు ఖాళీ చేయమని ఇంటి ఓనర్‌ ఆమెను వేధిస్తున్నారట. కాగా కోర్టు ఆమెను ఈ నెల 12వ తేదీ వరకు ఆ ఇంటిలోనే ఉండవచ్చని చెప్పింది.

(300)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ