WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'యండమూరి,రామ్‌గోపాల్‌వర్మ'లపై 'నాగబాబు' సంచలన వ్యాఖ్యలు...!

ప్రముఖ రచయిత 'యండమూరి వీరేంధ్రనాథ్‌, సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై సినీనటుడు, నిర్మాత 'నాగబాబు' సంచలన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్‌ చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నెం.150' చిత్రం ఫ్రీరిలీజ్‌ ఫంక్షన్‌లో మెగాస్టార్‌ సోదరుడు 'నాగబాబు' మాట్లాడుతూ వారి పేర్లను ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. 'యండమూరి'ని ఉద్దేశిస్తూ ఆయన గొప్ప రచయిత...కనిపిస్తే కాళ్లకు దండం పెడతా...కానీ అతనొక మూర్ఖుడు..పైగా వ్యక్తిత్వవికాసం కోర్సులు చెబుతాడు..తనకు వ్యక్తిత్వం లేకుండా ఇతరులకు వ్యక్తిత్వ కోర్సులను భోధించే గొప్పవాడు..అని విరుచుకుపడ్డారు. 

  రామ్‌గోపాల్‌వర్మ గురించి మాట్లాడుతూ ఈయనగారు ఎప్పుడూ ఆన్‌లైన్‌లోనే ఉంటారు...ముంబైలో సినిమాలు చేసుకునే వాడు...ఇప్పుడూ ఇక్కడ తగలడ్డాడు...అతనో ఆకుపక్షి, సినిమాలు సరిగా తీయడం రాదు..ముందు సినిమాలు సరిగా తీయడం నేర్చుకుని తరువాత ఇతరులపై విమర్శలు చేయాలని విమర్శించారు. వీళ్లద్దరూ పెద్ద మొనగాళ్లు అయినట్లు ప్రతిదానికి 'చిరంజీవి'ని విమర్శిస్తారు...'చిరంజీవి' ఏమి చేయాలో...ఏమి చేయకూడదో వీళ్లు నిర్దేశిస్తారా...? అసలు వీళ్ల స్థాయి ఏమిటని ధ్వజమెత్తారు. హిట్‌ అయ్యే సినిమాను హిట్‌ కాకుండా ఎవరూ ఆపలేరు...అదే విధంగా ఫెయిల్‌ అయ్యే సినిమా ఏమి చేసినా ఫెయిలే అవుతుందని 'నాగబాబు' వ్యాఖ్యానించారు. మొత్తం మీద రామ్‌గోపాల్‌వర్మ, యండమూరి గత కొన్నాళ్లుగా 'చిరంజీవి'ని ఉద్దేశించి చేస్తోన్న వ్యాఖ్యలు 'చిరు' శిబిరానికి చిర్రెత్తించి ఉంటాయని  విశ్లేషకులు భావిస్తున్నారు.


(510)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ