WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

హ్యాట్రిక్‌ ఓటమి వీరునికి...మండలి ఛైర్మన్‌ పదవా...?

టిడిపి సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిని శాసనమండలి ఛైర్మన్‌ అభ్యర్థిగా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయి. మార్చిలో శాసనమండలి ఛైర్మన్‌ 'చక్రపాణి' పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకానీ, 'జగన్‌' పార్టీకి మండలిలో బలం లేని నేపథ్యంలో టిడిపికి ఆ పదవి దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. మండలి ఛైర్మన్‌గా మాజీ మంత్రి ముద్దుకృష్ణమనాయుడిని ఎంపిక చేయాలని 'చంద్రబాబు' భావించారు. కానీ..అసెంబ్లీ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, ముద్దుకృష్ణమనాయుడులు ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో ఆయన నియామకాన్ని పక్కనపెట్టారు. ఈ నేపథ్యంలో 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన వారిని మండలి ఛైర్మన్‌గా ఎంపిక చేయాలని 'చంద్రబాబు' నిర్ణయించు కున్నారు. ప్రస్తుత మండలి వైస్‌ ఛైర్మన్‌ 'సతీష్‌రెడ్డి' పదవీ కాలం మార్చిలో ముగియనుంది. మళ్లీ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చే అవకాశాలు ఉండడంతో మండలి ఛైర్మన్‌గా తనను ఎంపిక చేయాలని 'సతీష్‌' కోరుతున్నారు. కానీ ఆయన రాజకీయ అనుభవం కేవలం 'పులివెందుల' నియోజకవర్గానికి మాత్రమే పరిమితం కావడంతో అపారఅనుభవం ఉన్న మాజీ మంత్రి 'సోమిరెడ్డి' వైపే 'చంద్రబాబు' మొగ్గుచూపుతున్నారు. నెల్లూరు జిల్లాలో 'రెడ్డి' సామాజిక వర్గ ఓటర్లలో ఎక్కువ మంది 'జగన్‌' వైపు మొగ్గు చూపుతున్న నేపథ్యంలో, వారిని ఆకర్షించేందుకు 'సోమిరెడ్డి'కి పదవి ఇవ్వాలని ఆయన భావిస్తున్నారు. అంతో ఇంతో 'రెడ్డి' సామాజికవర్గంలో 'సోమిరెడ్డి'కి పట్టుఉంది. 

    1994లో ఎమ్మెల్యేగా 'సర్వేపల్లి' నియోజకవర్గం నుంచి విజయం సాధించిన 'సోమిరెడ్డి' 99లో కూడా గెలుపొంది 'చంద్రబాబు' మంత్రివర్గంలో పనిచేశారు. 2004,2009,2014 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 'కొవ్వూరు' ఉప ఎన్నికల్లో సమీపబంధువు, మాజీ మంత్రి 'నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి'పై పోటీ చేసి ఓడిపోయారు. దీంతో వరుసగా నాలుగుసార్లు 'సోమిరెడ్డి' ఓటమి పొంది ముందుగా హ్యాట్రిక్‌ ఓటమి వీరునిగా పేరుతెచ్చుకున్నారు. నెల్లూరులో ఆ విధంగా ప్రజల తిరస్కారానికి గురైన ఏకైక నాయకుడు 'సోమిరెడ్డే'. మంత్రి పదవి ఆశిస్తున్న 'సోమిరెడ్డి'పై ఇటీవల ఆయన రాజకీయ ప్రత్యర్థి 2014 ఎన్నికల్లో ఆయనపై విజయం సాధించిన 'కాకాని గోవర్థన్‌రెడ్డి' ఇటీవల చేస్తున్న అవినీతి ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయా ఆరోపణలకు రుజువులు చూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని 'సోమిరెడ్డి' సవాల్‌ విసిరారు. 'కాకాని'పై పోలీసు కేసు కూడా పెట్టారు. ఆ విచారణలో 'కాకాని' ఆరోపణలకు ఆధారాలు లభించలేదు. అన్నీ బోగస్‌ పత్రాలని పోలీసుల విచారణలో తేలింది. ఇవన్నీ తనకు ఎవరో ఇచ్చారని...వాటి ఆధారంగా ఆరోపణలు చేశాని 'కాకాని' చెబుతున్నారు. కానీ..'కాకాని' చేసిన ఆరోపణలు రాజకీయంగా 'సోమిరెడ్డి'కి తీవ్ర అపఖ్యాతి వచ్చింది. దీంతో మంత్రి పదవి ఆశిస్తున్న 'సోమిరెడ్డి'కి ఆ పదవి దక్కే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఆయనను శాసనమండలి ఛైర్మన్‌గా ఎంపిక చేస్తారని నెల్లూరు జిల్లా టిడిపి నాయకులు చెబుతున్నారు. 

(217)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ