WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

తిరుమల జెఇఒ 'శ్రీనివాసరాజు'పై సీబీఐ కన్ను...!

టిటిడి బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి వ్యవహారంలో దూకుడుగా వ్యవహరించి ఆయనను అరెస్టు చేసిన సీబీఐ అధికారులు ఆయనకు సహకరించిన వారిపై ఇప్పుడు కన్నేసింది. శేఖర్‌రెడ్డికి ఎవరెవరు సన్నిహితులో... ఎవరెవరితో ఎటువంటిలావాదేవీలు ఉన్నాయో తెలుసుకుంటున్నారని తెలుస్తోంది. దీంతో తిరుమల జెఇఒ శ్రీనివాసరాజు వ్యవహారం బయటపడే అవకాశాలు ఉన్నాయని 'తిరుమల'లో ప్రచారం జరుగుతోంది. 'శేఖర్‌రెడ్డి' సిఫార్సులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి పలువురికి ఎల్‌-1 పద్దతి ద్వారా శ్రీవారి దర్శనాలను శ్రీనివాసరాజు ఏర్పాటు చేశారు. ఇప్పుడిప్పుడే అవన్నీ బయటకు వస్తున్నాయి. తమిళనాడు రాజకీయనాయకులు, అధికారవర్గాలు గత ఏడాది కాలంలో 'తిరుమల'కు ఎక్కువగా రావడం జరిగిందని, వారికి ఎల్‌-1 ద్వారా దర్శనాలను  జెఇఒ శ్రీనివాసరాజు ఏర్పాటు చేశారని, ఇందుతలో తమ ప్రమేయం లేదని జెఇఒ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు చెబుతున్నారు. ఎక్కడ తమకు ఈ మట్టి అంటుంతుందేమోననే భయంతో వారు కనిపిస్తున్నారు. 

   వీరిలో కొందరిని మీడియా ప్రతినిధులు కలసి ప్రశ్నించగా..జెఇఒ నిర్ణయాలను మాత్రమే మేము అమలు చేశాం...ఎవరెవరు ఏ పద్దతి ద్వారా దర్శనం చేసుకుంటే తమకెందుకని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ...ఇందులో కొందరు అతిగా వ్యవహరించి ఆర్థిక లబ్దిపొందారని ఉద్యోగులు చెబుతున్నారు. 'శేఖర్‌రెడ్డి'తో ఉన్న సాన్నిహిత్యంతో బెంగుళూరు, చెన్నైలలో ఆస్తులు కొనుగోలు చేశారని, వీటిపై విచారణ జరిపితే ఎక్కడెక్కడ ఏయే ఆస్తులు ఉన్నాయో బయటకు వస్తాయని ఉద్యోగులు అంటున్నారు. 'శేఖర్‌రెడ్డి'కి రెడ్‌కార్పెట్‌ వేయడంలో శ్రీనివాసరాజు ప్రమేయమే ఎక్కువగా ఉందని ఆయన కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. ఎల్‌-1 పద్దతి ద్వారా ఒక్కొక్క రోజు 500 టిక్కెట్లు కేటాయించారని అందులో తమిళనాడు, బెంగుళూరుకు చెందిన వారే ఎక్కువగా ఉన్నారని వారు అంగీకరిస్తున్నారు. 

  తన వ్యాపారా లావాదేవీలను పరిష్కరించుకునేందుకు శ్రీవారి దర్శనాన్ని 'శేఖర్‌రెడ్డి' అస్త్రంగా ఉపయోగించుకున్నారు..ఊబిలో కూరుకుపోయారు. ఆయన నోరు తెరిస్తే జెఇఒ శ్రీనివాసరాజు వ్యవహారం కూడా బయటకు వస్తుంది. ఇదంతా బయటకు రాకముందే జెఇఒ శ్రీనివాసరాజును తప్పించాలని 'చంద్రబాబు'పై రోజు రోజుకు ఒత్తిడి పెరుగుతుంది. ప్రముఖ వ్యక్తుల సిఫార్సుతో పాటు, ఇతర ముఖ్యుల అండదండలు ఉన్న శ్రీనివాసరాజుపై ముఖ్యమంత్రి చంద్రబాబు ధైర్యంగా వేటు వేస్తారా..? ఇంత వరకు దీనిపై చర్చ జరగలేదని సిఎంఒ వర్గాలు ధృవీకరిస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ 'శ్రీనివాసరాజు' 'శేఖర్‌రెడ్డి'కి సహకరించారు..ఆయన పాపాలల్లో వాటా పంచుకున్నారు. ఇటీవల కాలంలో 'శ్రీనివాసరాజు' ఆందోళనతో కనిపిస్తున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. మంత్రి మాణిక్యాలరావును ఖాతరు చేయరు..సిఎంఒ సిఫార్సులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు..దీనితో శ్రీనివాసరాజు విర్రవీగారు..రెచ్చిపోయారు..శేఖర్‌రెడ్డి వ్యవహారంలో దొరకబోతున్నారు.

(319)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ