WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' 'రెడ్డి' కాదట...!

వైకాపా అధ్యక్షుడు వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డిపై ఇటీవల కాలంలో ఒంటికాలిపై లేస్తున్న అనంతపురం ఎంపి జె.సి.దివాకర్‌రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అసలైన 'రెడ్డి' కాదట. ఆయన క్రైస్తవుడని..అన్నారు. ఇంతకు ముందు కర్నూలులో ఓ సభలో 'దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ వై.ఎస్‌.జగన్‌ 'రెడ్డి' కాదని...'రెడ్డి' కులస్తులంతా ఇది గుర్తుంచుకోవాలని అన్నారు. శుక్రవారం నాడు కృష్ణా జిల్లాలో జరుగుతున్న కోడి పందాలకు వచ్చిన సందర్భంలో ఆయన మాట్లాడుతూ మరోసారి ఇవే వ్యాఖ్యలు చేశారు. 'మాగంటిబాబు'తో కలసి వచ్చిన ఆయన మాట్లాడుతూ సీమకు నీరు ఇస్తే తమ ప్రాంతం కూడా కృష్ణా జిల్లా వలే అభివృద్ధి చెందుతుందని వ్యాఖ్యానించారు. జెసి స్వయంగా కోడిపందాలకు రావడంతో ఈ ప్రాంతంలో ఉత్సాహం నెలకొంది. ఆయనను 'రాయలసీమబిడ్డ'గా పేర్కొంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.  


(905)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ