WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'కోహ్లీ' 'రోనాల్డో' అట...!

ఇంగ్లాండ్‌పై 350 పరుగుల టార్గెట్‌ను చేధించిన భారత్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. నిన్న పూనేలో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ అసాధ్యమైన టార్గెట్‌ను అవలీలగా సాధించింది. ఈ సందర్భంగా కెప్టెన్‌ కోహ్లీ, మరో ఆటగాడు జాదవ్‌లు సెంచరీలతో మోత మోగించారు. తొలుత 64 పరుగులకే 4వికెట్లు కోల్పోయి ఓడిపోయే స్థితిలో ఉన్న భారత్‌ను 'కోహ్లీ' సెంచరీతో నిలబెట్టాడు. దీంతో ప్రపంచ క్రికెట్‌లో మరోసారి 'కోహ్లీ' పేరు మారుమోగిపోతోంది. ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ నాసీర్‌హుస్సేన్‌ 'కోహ్లీ'ని 'క్రిస్టియానో రోనాల్డో'గా వర్ణించాడు. అతని ఆటతీరు వర్ణించ సాధ్యం కాదని కితాబు ఇచ్చారు. ఆయన ఒక్కరే కాదు..భారత్‌ ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్‌, సచిన్‌ టెండూల్కర్‌, ఆస్ట్రేలియా క్రికెటర్‌ మైకేల్‌వాన్‌, వి.వి.ఎస్‌.లక్ష్మణ్‌, సంజయ్‌ మంజ్రేకర్‌, కుంబ్లే వంటి ఆటగాళ్లు అతని అభినందనలతో ముంచెత్తారు. 

(177)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ