WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

త్వరలో యాప్‌ ద్వారా శ్రీవారి దర్శన టిక్కెట్లు...!

తిరుమల తిరుపతి వెంకన్న భక్తులకు శుభవార్త. మీరు శ్రీవారిని దర్శించుకోవాలంటే ఇక గంటలు గంటలు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అక్కడికి వెళితే రూమ్‌లు దొరుకుతాయో...లేదో..అన్న సందేహం వలదు...రూమ్‌ సౌకర్యం, దర్శనటిక్కెట్లు ఇక మీరు శ్రీవారి యాప్‌ ద్వారా ముందే బుక్‌ చేసుకోవచ్చు. ఈ విధానాన్ని త్వరలో అమలులోకి తెస్తున్నట్లు టిటిడి ఇఒ సాంబశివరావు మంగళవారం నాడు తెలిపారు. రూ.300 టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే సంఖ్యను పెంచారు. ఇంతకు ముందు ఆరు టిక్కెట్లు మాత్రమే ఆన్‌లైన్‌ బుక్‌ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు వాటి సంఖ్యను 10కి పెంచారు. అన్నమయ్య భవన్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఇఒ సాంబశివరావు వెల్లడించారు. త్వరలోనే శ్రీవారి యాప్‌ భక్తులకు అందుబాటులోకి తేనున్నట్లు ఆయన తెలిపారు. దీని ద్వారా భక్తులకు దర్శనం, వసతి సౌకర్యాలు పొందేందుకు మరింత సులభంగా ఉంటుందని ఆయన అన్నారు.


(264)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ