WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సంక్రాంతి' విజేత 'బాలయ్యే': తమ్మారెడ్డి...!

ఒకవైపు మెగా అభిమానులు...మరో వైపు బాలకృష్ణ అభిమానులు సంక్రాంతి విజయం తమదంటే తమదంటూ వాగ్వివాదాలు చేసుకుంటుంటుంటే, ఎవరిది విజయమో ఓ ప్రముఖుడు తేల్చి చెప్పారు. ఏ మాత్రం మొహమాటం లేకుండా ఉన్నది ఉన్నట్లు మాట్లాడే నిర్మాత,దర్శకుడు తమ్మారెడ్డి భరధ్వాజ సంక్రాంతి విజయం ఎవరిదో తేల్చాశారు. సంక్రాంతి విజయం బాలకృష్ణదేనని ఆయన మొహమాటం లేకుండా చెప్పారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఊహించినదానికంటే గొప్పగా ఉందని, బాలయ్య కెరీర్‌లో ఇదో గొప్ప చిత్రంగా మిగిలిపోతుందని ఆయన అన్నారు. తక్కువ సమయంలో ఇటువంటి అద్బుతం చేయడం 'కృష్‌'కే సాధ్యమని ఆయన కితాబు ఇచ్చారు. బాహుబలి, శాతకర్ణి బడ్జెట్లు వేరయినా దానితో పోల్చి చూసే స్థాయికి 'శాతకర్ణి' వెళ్లిందని, తెలుగు సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లిన 'బాలయ్యే' సంక్రాంతి విన్నర్‌ అని ఆయన స్పష్టంగా ప్రకటించారు. బాలయ్యతో పోటీ పడ్డ చిరంజీవి సినిమా ఖైదీనెంబర్‌ 150 కలెక్షన్లలో దుమ్మురేపుతోందనీ, 'చిరు' స్టామినాను మరోసారి ఇది రుజవు చేసిందని అయితే 'చిరు' స్థాయికి ఇది సరిపోదని వ్యాఖ్యానించారు. సినిమాను ఇంకా బాగా తీయాల్సి  ఉందని, 'చిరు'సినిమా స్థాయిలో లేదని ఆయన అన్నారు. మరో సినిమా 'శతమానంభవతి' మంచి క్లాసిక్‌ సినిమా అని చెప్పారు. మొత్తం భరధ్వాజ వ్యాఖ్యానాలతో 'బాలయ్య' అభిమానులు చిందులేస్తున్నారు.


(819)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ