WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

దర్శకత్వం చేస్తా:బాలకృష్ణ

ఈ ఏడాదిలో తాను ఒక చిత్రానికి దర్శకత్వం చేస్తానని నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ఎన్టీఆర్‌ 20వ వర్థంతి సందర్భంగా ఇక్కడ ఒక హోటల్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తనకు పౌరాణిక చిత్రాలంటే చాలా ఇష్టమని, మన వద్ద పౌరాణిక చిత్రాలకు తీసే దర్శకులు చాలా మంది ఉన్నారని, అయితే వారు ఎవరూ ముందుకు రాకపోతే తానే పౌరాణిక చిత్రాలకు దర్శకత్వం వహిస్తానని తెలిపారు. దర్శకుడిగా,నిర్మాతగా మారాలని భావిస్తున్నాను...ఈ సంవత్సరంలో అది జరుగుతుందని ఆయన చెప్పారు. తన కుమారుడు మోక్షజ్ఞతో కలసి ఆధిత్య 369 సినిమాకు సీక్వెల్‌ చేస్తామని 'ఆధిత్య999' పేరుతో అది వస్తుందని ఆయన తెలిపారు. తన కుమారుడు ఇప్పుడే నటన గురించి కొన్ని విషయాలను నేర్చుకుంటున్నారని ఈ ఏడాది అతను హీరోగా సినిమా చేస్తాడని, దర్శకుడు ఎవరో ఇంకా నిర్ణయించలేదన్నారు. తనకు ప్రణాళిక వేసుకుని పనిచేయడం ఇష్టం ఉండదని, ఎప్పుడు ఏం చేయాలంటే అది చేయడమేనని ఆయన అన్నారు. 

(340)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ