WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'చిరంజీవి' నాకు క్లోజ్‌ఫ్రెండ్‌:బాలయ్య...!

తెలుగు సినిమా పరిశ్రమలో తనకు చాలా సన్నిహితమైన ఒకే ఒక్క మిత్రుడు 'చిరంజీవి' అని 'నందమూరి బాలకృష్ణ' తెలిపారు. ఇటీవల ఆయన ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపారు. వాస్తవానికి 'చిరంజీవి' నాకు చాలా క్లోజ్‌ఫ్రెండ్‌. వృత్తిరీత్యా మా మధ్య పోటీ ఉండవచ్చు. కానీ..అది సినిమాలకే పరిమితం. వృత్తిలో పోటీ ఉంటేనే మెరుగ్గా రాణిస్తామని ఆయన చెప్పారు. వృత్తిపరంగా పోటీ ఉన్నా వ్యక్తిగతంగా తాము చాలా సన్నిహితులమని ఆయన చెప్పారు. సంక్రాంతికి 'చిరంజీవి' ఖైదీనెంబర్‌ 150, బాలయ్య 'గౌతమీపుత్రశాతకర్ణి' పోటీ పడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరువురి అభిమానులు సోషల్‌మీడియాలో తమది పైచేయి అంటే తమది పైచేయి అని వ్యాఖ్యలు చేసుకుని దూషించుకున్నారు. తమ సినిమా బాగుందంటే తమ సినిమా బాగుందని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకున్నారు. రెండు సినిమాలు తమ జానర్‌లో వేటికవే గొప్ప విజయం సాధించడం ఇప్పుడిప్పుడే అంతా సద్దుమణుగుతోంది. బాలకృష్ణ వ్యాఖ్యలతో ఇక అంతా సుఖాంతం కానుంది.


(361)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ