'అమరావతి' పర్యటనలో 'జగన్‌'కు షాక్‌...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అమరావతి' పర్యటనలో 'జగన్‌'కు షాక్‌...!

ప్రజారాజధాని 'అమరావతి'లో పర్యటిస్తున్న ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్‌కు స్థానిక ప్రజల నుండి నిరసన ఎదురయింది. ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తోందని ఆరోపిస్తూ...భూములు ఇవ్వని రైతులకు మద్దతుగా అక్కడ పర్యటిస్తున్న 'జగన్‌'కు స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలు, రైతుల నుండి నిరసన వ్యక్తం అయింది. ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో 'జగన్‌' ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని వారు ఆరోపించారు. 'జగన్‌' గో బ్యాక్‌అంటూ వారు నల్లజెండాలతో నిరసన తెలిపారు. అయితే నిరసనల మధ్యే 'జగన్‌' తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం రైతుల వద్ద నుండి భూములను బలవంతంగా గుంజుకుంటుందని ఎకరా రూ.15కోట్లు పలికే భూమికి ప్రభుత్వం కేవలం రూ.30లక్షలు ఇస్తుందని ఆయన ఆరోపించారు. పలువురు రైతులతో ఆయన ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి వారి సమస్యలను తెలుసుకున్నారు.


(344)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ