WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

టీటీడీ ఇఒ రేసులో 'జవహర్‌రెడ్డి'...!

టీటీడీ ఇఒ సాంబశివరావును బదిలీ చేసి ఆయన స్థానంలో ఎపి రెసిడెంట్‌ కమీషనర్‌ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను నియమించ బోతున్నారని జరుగుతున్న ప్రచారం వేడెక్కింది. ఈ నేపథ్యంలో ఆ పోస్టును దక్కించుకునేందుకు సీనియర్‌ ఐఎఎస్‌ అధికారి 'జవహర్‌రెడ్డి' తన వంతు ప్రయత్నాలను ప్రారంభించారు. టీటీడి ఇఒగా తెలుగేతర ఐఎఎస్‌ అధికారిని ఇంతకు ముందు ఎప్పుడూ నియమించలేదని, ఇప్పుడు ఎలా నియమిస్తారని 'జవహర్‌రెడ్డి' ప్రశ్నిస్తున్నారట. నిన్నటి వరకు 'వెలగపూడి' రానని మొండికేసిన 'జవహర్‌రెడ్డి'ని ముఖ్యమంత్రి చంద్రబాబు బతిమిలాడి, బుజ్జగించి విధుల్లో చేరేలా చేశారు. దీన్ని అలుసుగా తీసుకున్న 'జవహర్‌రెడ్డి' ప్రభుత్వాన్ని పరోక్షంగా బెదిరించే వ్యాఖ్యలు పలువురి సమక్షంలో చేశారట. దీంతో టీటీడీ ఇఒ పోస్టు వ్యవహారం మరింత వేడెక్కింది. 'సాంబ'ను బదిలీ చేయడం ఖాయం. 'సింఘాల్‌' నియామకం కూడా దాదాపు ఖాయమే. మధ్యలో 'జవహర్‌రెడ్డి' అడ్డుపడ్డా... మరెవరైనా అడ్డుపడ్డా..ఏమీ జరగదు అని విశ్వసనీయవర్గాల బోగట్టా. ఎట్టిపరిస్థితుల్లో ఈ పోస్టును దక్కించుకోవాలని 'జవహర్‌రెడ్డి' పట్టుదలతో ఉన్నారు. 'చంద్రబాబు' సన్నిహితులైన కొందరి వ్యక్తులతో ఆయన ఇప్పటికే చర్చించినట్లు బయటకి పొక్కింది. 

  ఒకవేళ టీటీడి ఇఒ పోస్టు తనకు దక్కకపోతే ధీర్ఘకాలిక సెలవుపై వెళ్లే అవకాశం ఉంది. ఇంతకు ముందు నాలుగు మాసాలు సెలవుపెట్టి ఒక నెల గడిచిన తరువాత విధుల్లో చేరారు ఆయన. ఆ తరువాత 'చంద్రబాబు' ప్రాధాన్యత గల పోస్టు ఇస్తానని హామీ ఇచ్చారని  ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇందులో నిజానిజాలేమిటో ఎవరికీ తెలియదు. అంతా ఒక పథకం ప్రకారం ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారం వెనుక 'జవహర్‌రెడ్డి' హస్తం ఉందా...? మరెవరి హస్తం ఉందా? అనేది త్వరలోనే బయటకు రానుంది. టీటీఇ పోస్టు 'జవహర్‌రెడ్డి'కి దక్కడం ఖాయమని తెలుగు ఐఎఎస్‌ అధికారులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి అయినా...లేక బెదిరించి అయినా 'జవహర్‌రెడ్డి' ఆ పోస్టును దక్కించుకునే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాల భోగట్టా. సాంబశివరావును ఎందుకు బదిలీ చేస్తున్నారు... అనే విషయంపై 'సచివాలయం'లో చర్చ జరుగుతోంది. రకరకాల కథనాలు ప్రచారం జరుగుతున్నాయి. సింఘాల్‌ను తెరపైకి తెచ్చిందెవరు? 'సాంబు' బదిలీపై ఒత్తిడి తెస్తున్నదెవరు అని ఆరా తీయగా కేంద్ర మంత్రి సుజనాచౌదరి హస్తం దీనిలో ఉందని బయటపడింది. అంతే కాకుండా ఆయన మరో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ద్వారా సిఎంతో మాట్లాడించినట్లు తెలిసింది. దీనిని 'వెంకయ్య' కొట్టివేయలేదు...! దీంతో ఆయన సిఫార్సు వాస్తవం అని స్పష్టం అయింది. తెలుగు..తెలుగేతర నినాదం తెరపైకి రాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న తీసుకున్న నిర్ణయాన్ని వెనుక్కు తీసుకుని 'జవహర్‌రెడ్డి' ని టీటీడీ ఇఒగా నియమిస్తారా...? ఏం జరగనుందో వేచి చూడాల్సిందే...!

(675)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ