WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'రావెల'పై 'చినబాబు' ఆగ్రహం...!

తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకులైన వారిని, నిన్నటి వరకు 'చంద్రబాబు'ను అసభ్య పదజాలంతో దూషించిన వారిని మంత్రి రావెల కిశోర్‌ చేరదీస్తూ సీనియర్‌ కార్యకర్తలను, పార్టీకి వీరవిధేయులను, గత ముప్పయేళ్ల నుండి పార్టీని భుజాన మోస్తున్న వారిని పరోక్షంగా, ప్రత్యక్షంగా అవమానిస్తున్నారని 'చినబాబు'కు పలువురు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా 'రావెల' నియోజకవర్గమైన 'పత్తిపాడు'లోని వివిధ మండలాల పార్టీ కార్యకర్తలు, నాయకులు, స్థానిక సంస్థల ప్రతినిధులు మంత్రి రావెల పలుసార్లు ముఖ్యమంత్రికి గతంలో ఫిర్యాదు చేశారు. ఇది మనసులో పెట్టుకున్న మంత్రి రావెల ఆ ఫిర్యాదు చేసిన వారిని రాజకీయంగా, అధికారికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో మండిపడ్డవారందరూ 'చినబాబు'ను స్వయంగా కలసి ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీనిపై మండిపడ్డ 'చినబాబు' మరో 15రోజుల్లో మీకు ఇష్టమైన వార్తను వినబోతున్నారని నర్మగర్భంగా వ్యాఖ్యానించారు. దీనిని బట్టి మంత్రి రావెలను పదవి నుండి తొలగించడం ఖాయమని స్పష్టం అవుతుంది. 

 ఇంతకు ముందే 'రావెల'ను పిలిపించి మందలించి,హెచ్చరించాల్సిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయనకు పరోక్షంగా సహకరించారు. దీంతో మంత్రి రావెల చెలరేగిపోయారు. అధికారం లేనప్పుడు కష్టపడిన కార్యకర్తలను విస్మరించి, పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వారిని 'రావెల' చేరదీయడంతో వివాదాలు ప్రారంభమైయ్యాయి. 'రావెల' పార్టీ కోసం ఏమి కష్టపడ్డారు...? ఎమ్మెల్యే సీటు ఎందుకు ఇచ్చారు...? అయినా సరే గెలిపించాం...మంత్రి పదవి ఇస్తే సంతోషించాం... మా యొక్క బలహీనతలను (అనగా పార్టీకి వీరవిధేయులు) చేతగాని తనంగా భావించి స్వయం కృతంతో చేతులు కాల్చుకుని త్వరలో మాజీగా 'రావెల' మిగలబోతున్నారని అధికారపార్టీ ముఖ్యులు కూడా ఆఫ్‌ ది రికార్డుగా అంగీకరిస్తున్నారు. కలసి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా,అహంకారంతో, మూర్ఖత్వంతో, తప్పుడు మనుషుల చెప్పుడు మాటలు నమ్మి అసలకే మోసం కొని తెచ్చుకున్నారు మంత్రి రావెల. చెయ్యి కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మంత్రి రావెల ఫిర్యాదు చేసిన వారిని ఆకట్టుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారట. జరగవల్సిన నష్టం జరిగింది. అనేక  ఇబ్బందులు పడ్డాం...ఇప్పుడు బతిమిలాడినా..బుజ్జగించినా...ఆశలు పెట్టినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదు...మంత్రి పదవి నుంచి 'రావెల'ను తొలగించాల్సిందే అని 'పత్తిపాడు' నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు మొండిపట్టుదలతో ఉన్నారు. 

(436)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ