WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'ఠక్కర్‌'ను సెలవుపై పంపిస్తారా...?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పోస్టు నుండి రిటైర్‌ అయినప్పటికీ ఆరు నెలలు సర్వీసు పొడిగింపుతో ఇంకా పదవిలో కొనసాగుతున్న 'ఠక్కర్‌'కు ఫిబ్రవరి మాసాంతం వరకు గడువు ఉంది. అనారోగ్యంతో ఆయన విధులను హైదరాబాద్‌ నుండే నిర్వహిస్తున్నారు. ఈ వారం నుండి 'వెలగపూడి' నుండి బాధ్యతలు నిర్వహిస్తున్నా...? ఆయనపై ఒత్తిడి పెంచి సెలవుపై పంపి 'అజయ్‌కల్లం'ను ఇన్‌ఛార్జి సిఎస్‌గా నియమించ బోతున్నారని సచివాలయంలో ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఇందులో నిజానిజాలు ఏమైనప్పటికీ 'అజయ్‌'ను సిఎస్‌ పోస్టులో నియమించాలని 'చంద్రబాబు' నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు కేవలం ఒకే ఒక నెల సర్వీసు ఉంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1వ తేదీ నుండి 'ఠక్కర్‌'ను సెలవుపై పంపించి ఇన్‌ఛార్జి సిఎస్‌గా 'అజయ్‌కల్లం'ను నియమించి మార్చి నెలలో పూర్తి స్థాయి సిఎస్‌గా నియమించాలని 'చంద్రబాబు' భావిస్తున్నట్లు విశ్వసనీయవర్గాల భోగట్టా. ఒకవేళ తెలంగాణ సిఎస్‌ 'కత్తి' సర్వీసు పొడిగింపు వ్యవహారంలో జరిగిన ఉదంతమే ఎపిలో పునరావృతం అయితే సిఎం చంద్రబాబు పరిస్థితి ఏమిటి...? 'రెడ్డి' సామాజికవర్గానికి చెందిన 'అజయ్‌'ను సిఎస్‌గా నియమించితే ఆ వర్గ ఓటర్లలో ఉన్న వ్యతిరేకత కొంత మేర తగ్గుతుందని 'బాబు' నమ్మకమట. పదేళ్లు అధికారం చెలాయించాం...అన్ని వర్గాలపై పెత్తనం చేశాం.. ఇప్పటికీ అధికారం కోల్పోయి రెండున్నేర్లు అయింది. ఇంత వరకు రాజకీయంగా,ఆర్థికపరంగా ఏమీ నష్టపోలేదు.. అప్పట్లో 'జగన్‌'కు మద్దతు ఇచ్చాం....ఇప్పుడు కూడా ఇస్తాం...ఎప్పటికైనా ఇస్తాం...అని ఆ వర్గ ఓటర్లు బాహాటంగా చెబుతున్న పరిస్థితుల్లో వారిని 'బాబు' శాంతింప చేయగలరా...? 'కల్లం'కు సిఎస్‌ పోస్టు ఇస్తే వారు శాంతి ఇస్తారా...? ఎవరికి ఏమి పోస్టు ఇచ్చినా...పెత్తనం చేసేది 'చంద్రబాబు' ఆయన సామాజికవర్గ నాయకులే కదా...? మరో రెండున్నరేళ్లు గడిచిన తరువాత 'జగన్‌' ముఖ్యమంత్రి అవడం ఖాయమనే నమ్మకంతో 'రెడ్డి' సామాజికవర్గ ఓటర్లు ఉన్నారు. ఈవిషయం ఇంటిలిజెన్స్‌ వర్గాలు కూడా ధృవీకరించాయి. అయినప్పటికీ 'చంద్రబాబు' తెలుసుకోలేకపోతున్నారని ఆయన విధేయులైన అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  వై.ఎస్‌ 'జగన్‌'ను ముఖ్యమంత్రిని చేస్తేనే ఆయన సామాజికవర్గ ఓటర్లు శాంతించడం ఖాయం. ఇది జరిగే పనికాదు. 'అజయ్‌కల్లమా...? ఆయనెవరు...? ఆయనకు సిఎస్‌ పోస్టు ఇస్తే మాకు ఒరిగేదేమిటి...? సంపూర్ణ అధికారం మాకు కావాలి...అంతే కానీ పది మంత్రి పదవి పోస్టులు 'రెడ్డి' సామాజికవర్గానికి ఇచ్చినా... మేము పట్టించుకోం..! అని ఆ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి. 'జమ్మలమడుగు' ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి టిడిపిలో చేరినా ఆయన సామాజికవర్గ ఓటర్లు ఇప్పటికీ 'జగన్‌'కే మద్దతు ఇస్తున్నారని స్వయంగా ఆయనే ఆఫ్‌ ది రికార్డుగా పలువురికి చెబుతు న్నారు. ఉన్న రెడ్డి నాయకులను ఆదరించకుండా 'జగన్‌'రెడ్డి నాయకులను పార్టీలో చేర్చుకున్నంత మాత్రాన ఆ సామాజికవర్గ ఓటర్లు 'టిడిపి'కి మద్దతు ఇస్తారా...? అని అనంతపురం జెసి దివాకర్‌రెడ్డి బాహాటంగానే వ్యాఖ్యానించారు. 'చంద్రబాబు' పిచ్చి భ్రమల్లో ఉన్నారు..పగటి కలలు కంటు న్నారు... పగటి కలలు ఎప్పుడూ నిజం కావు...ఇప్పటికైనా కళ్లు తెరిచి కుల, మతాలకు అతీతులుగా సమర్థుడు, నిజాయితీపరుడైన అధికారిని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమించుకోగలిగితే ఆ సంకేతాలు ప్రజల్లోకి వెళ్లి ప్రభుత్వ ప్రతిష్టత పెరుగుతుందే తప్ప...ఇలాంటి కుప్పిగంతులు వృధాప్రయాసే...! 

(277)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ