WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్‌ బూతుపురాణం...!

ఆయన తెలుగుదేశం పార్టీలో సీనియర్‌ నాయకుడు. అపార రాజకీయ అనుభవం ఉంది. సర్పంచ్‌ నుండి జీవితం ప్రారంభించారు. అంచెలంచెలుగా ఆంధ్రప్రదేశ్‌ సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుని స్థాయికి ఎదిగారు.టిడిపి అధికారపార్టీ ప్రతినిధిగా వివిధ చర్చావేదికల్లో పాలుపంచుకున్నారు. విపక్షాల నాయకులను చీల్చి చెండాడంతో లౌక్యంతో పాటు, ఆగ్రహాన్ని బహిరంగ వేదికలపై ప్రదర్శిస్తుంటారు. ఆరేళ్లు ఎమ్మెల్సీగా బాధ్యతలు నిర్వహించి ఇటీవలే మళ్లీ ఎన్నికయ్యారు. ఇంత అనుభవం ఉన్న ఆ నాయకుడు ఎవరో కాదు. కృష్ణా జిల్లా నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన 'బాబూ రాజేంద్రప్రసాద్‌'. ఇటీవల ఒకరిని ఫోన్‌లో పచ్చిబూతులు తిట్టారు. ఆ బూతులన్నీ రికార్డు అయ్యాయి. ఆ మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో హల్‌చెల్‌ సృష్టిస్తున్నాయి. అసలేం జరిగిందంటే ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్‌ కారుకు ఒక ఫ్యాన్సీ నెంబర్‌ కోసం ఆర్టీఎ కార్యాలయానికి వెళితే అదే నెంబర్‌ కావాలని మరో వ్యక్తి పోటీ బడ్డారు. ఒకే నెంబరు కోసం ఇద్దరూ పోటీ పడడంతో నిబంధనల ప్రకారం అధికారులు ఆ నెంబర్‌ను వేలం వేయడానికి నిర్ణయించారు. దీనితో తనతో పోటీకి వచ్చిన వ్యక్తిపై 'బాబూ రాజేంద్రప్రసాద్‌' బూతుల దండకం అందుకున్నారు. 

 సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే విధంగా ఆయన బూతులు లంకించుకున్నారు. తాను ఎమ్మెల్సీనని మరిచిపోయారా...? కేవలం ఫ్యాన్సీ నెంబర్‌ కోసం ఇంత దిగజారి వ్యవహరించాలా...? బతిమాలి, బుజ్జగించడం,నచ్చచెప్పగలిగితే అదే నెంబర్‌ కోసం పోటీపడిన ఆ వ్యక్తి తప్పకుండా వినేవారు. కాలుపై కాలు వేసుకుని ఆ వ్యక్తిపై అధికారం చెలాయిస్తే వారు ఊరుకుంటారా..? ఆయనేమన్నా...ఈయన అనుచరుడా...? ఇవన్నీ మరిచి ఆ వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా బూతుపురాణం విప్పి విమర్శలు కొనితెచ్చుకుని పరువు, ప్రతిష్టలను పోగొట్టుకున్నారు. ఆయన మాటలను రికార్డు చేసిన వ్యక్తి వాటిని సోషల్‌మీడియాలో పెట్టారు..రాజేంద్రప్రసాద్‌ బూతు పురాణం...మీరు కూడా...వినండి...!

(389)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ