WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'నాగ్‌..సార్‌'..అంటే చంపేస్తా...!

యాభై ఏళ్లు దాటినా ఇంకా నవయువకుడిగానే కనిపించే 'అక్కినేని నాగార్జున' తన ఇద్దరు కుమారులకు త్వరలో వివాహం చేయబోతున్నారు. చిన్నకొడుకు 'అఖిల్‌'కు 'మే'లో ప్రముఖ వ్యాపారవేత్త జీవీకె మనుమరాలు 'శ్రియా భూపాల్‌రెడ్డి'తో చేయబోతున్నారు. మరో కుమారుడు 'అక్కినేని నాగచైతన్య' వివాహం హీరోయిన్‌ 'సమంత'తో జరగనుంది. అయితే వీరికి పెళ్లి అయిన తరువాత 'నాగార్జున'ను కోడళ్లు ఏమని పిలుస్తారని సందేహం వస్తుందట. మొదట 'అఖిల్‌' కాబోయే భార్య 'శ్రియా' మొదటి నుంచి 'నాగార్జున'ను 'నాగ్‌..మామ' అని సంభోదిస్తుందట. దీంతో ఆమె విషయంలో క్లారిటీగానే ఉన్నారట 'నాగార్జున'.పెద్ద కోడలు 'సమంత' విషయంలోనే కన్యుప్యూజషన్‌ అట. ఎందుకంటే ఇంతకు ముందు ఆమె 'నాగార్జున'ను 'నాగ్‌...సార్‌' అని సంభోదించేదట. ఇప్పుడూ అదే విధంగా సంభోధిస్తే 'చంపేస్తా'నంటున్నాడు కింగ్‌ నాగార్జున. మరి 'సమంత' ఏమి చేస్తుందో చూడాలి మరి.

(1400)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ