WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌'కు 'జెసి' సవాల్‌...!

ప్రతిపక్షనేత వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి తాను 'రెడ్డి'నని చెప్పుకోగలడా...? ఆయనకు ఆ ధైర్యం ఉందా? అంటూ అనంతపురం ఎంపి జెసి దివాకర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. సోమవారం నాడు ఆయన విజయవాడలో విలేకరులతోమాట్లాడుతూ 'జగన్‌'కు దమ్ముంటే తన కులం ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాయలసీమలో తానొక్కడినే అసలైన 'రెడ్డి'నని ఆయన చెప్పుకున్నారు. తనకు వేరే కులాలు అంటే ధ్వేషం లేదని...కానీ..'రెడ్డి' కులస్తులు ఎవరైనా తన సహాయం కోసం వస్తే వారికి హృదయపూర్వకంగా సహాయం చేస్తానని ఆయన ప్రకటించారు. 'రెడ్లే' ఉమ్మడి రాష్ట్రాన్ని విభజనకు కారణమయ్యారని, 'రెడ్లు' వల్లే రాష్ట్రం విడిపోయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర విభజన వద్దని తాను 'రెడ్డి' కులస్తులు అందరి చేతులు, కాళ్లు పట్టుకున్నానని అయితే ఎవరూ పట్టించుకోలేదని, దీంతో రాష్ట్రం చాలా నష్టపోయిందని ఆయన అన్నారు. 

(885)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ