'సమర్ధుని'పై వేటు...అవినీతిపరులకు అందలం...! 

WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'సమర్ధుని'పై వేటు...అవినీతిపరులకు అందలం...!

టీటీడీ ఇఒ సాంబశివరావు, జెఇఒ శ్రీనివాసరాజును బదిలీ చేసి ఆ ఇద్దరి స్థానంలో ఎవరెవరిని నియమించాలనే విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులను మాత్రమే ఇఒగా నియమించే సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయానికి యధావిధంగా అమలు చేస్తారా...? మరొక విధంగా మార్పులు...చేర్పులు చేస్తారా అనే విషయంపై చర్చ జరుగుతోంది. టీటీడీ ఇఒగా సాంబశివరావును నియమించాక తన అనుభవంతో అనేక మార్పులు, చేర్పులు తెచ్చి రాజకీయ, అధికారవర్గాల ప్రశంసలు పొందారు. నిజాయితీపరుడిగా, సమర్థుడైన అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు. 'సాంబు'ను బదిలీ చేయాలని ఆలోచిస్తున్న ప్రభుత్వం ఆయన స్థాయి కల అధికారిని మళ్లీ ఇఒగా నియమించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అటువంటి స్థాయి కల అధికారులు అరుదుగా ఉన్నారనే ఆలోచనతో 'బాబు' ఉన్నారు. సాంప్రదాయాలను తెలిసిన వ్యక్తినే టీటీడి ఇఒగా నియమించాలని ముఖ్యమంత్రి చంద్రబాబును పలువురు పీఠాధిపతులు ముందే కోరారు. రెండేళ్లు గడువు ముగియటంతో 'సాంబు'ను బదిలీ చేయాలని రాజకీయ వత్తిడిలు రోజు..రోజుకు పెరిగిపోతున్న నేపథ్యంలో 'చంద్రబాబు' అయిష్టంగానే అంగీకరించారని తెలుస్తుంది. 

   మాజీ టీటీడీ బోర్డు సభ్యుడు శేఖర్‌రెడ్డి బినామీగా ఆరోపణలు ఎదుర్కొన్న తిరుమల జెఇఒ శ్రీనివాసరావుపై బదిలీ వేటు పడబోతుంది. శేఖర్‌రెడ్డికి శ్రీనివాసరాజు బినామీ అనే ప్రచారం జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం చర్య తీసుకోబోతోంది. శ్రీనివాసరాజు వచ్చిన ఆరోపణలపై సీబీఐ ఆరా తీస్తున్నట్లు రాష్ట్ర నిఘా వర్గాలు తెలుసుకున్నాయి. సంవత్సరంపైగా 'శేఖర్‌రెడ్డి'కి తిరుమలలో రెడ్‌కార్పెట్‌ పరిచిన ఘనత జెఇఓ శ్రీనివాసరాజుదే. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు, వివిధరాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏ పద్దతిలో శ్రీవారిని దర్శించుకునేవారో అదే పద్దతిలో 'శేఖర్‌రెడ్డి' సిఫార్సు చేసిన వారందరికీ దర్శనం చేయించారని 'శ్రీనివాసరాజు'పై ఆరోపణలు వచ్చాయి. తమిళనాడు రాజకీయవేత్తలు, వ్యాపారవేత్తలు, ఇతర ప్రముఖులు ఆ పద్దతిలో శ్రీవారిని దర్శించుకున్నారని దీని వెనుక 'శేఖర్‌రెడ్డి' సిఫార్సులు, జెఇఒ హస్తం ఉందని బయటకు వచ్చింది. శ్రీనివాసరాజుకు జాతీయస్థాయిలో ఉన్న ప్రముఖుల మద్దతు ఉండడంతో ఇప్పటి వరకు ఆయనను తిరుమల జెఇఒగా కొనసాగించిన సిఎం తాజాగా ఏర్పడిన పరిస్థితుల ప్రభావంతో ఆయనను బదిలీ చేయకతప్పడం లేదు. కానీ ఇప్పటికీ శ్రీనివాసరాజును బదిలీ చేయవద్దని ఢీల్లీ స్థాయిలో 'చంద్రబాబు'పై ఒత్తిడి వస్తోంది. ఇఒ సాంబశివరావును బదిలీ చేయాలని కోరుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుండగా...జెఇఒ శ్రీనివాసరాజును బదిలీ చేయవద్దని కోరే వారి సంఖ్య అంతకంతకు పెరిగిపోతోంది.నిజాయితీపరుడు, సమర్థుడు, ముక్కుసూటిగా నిర్ణయాలను తీసుకునే వారు, సామాన్య భక్తులకు అనేక సౌకర్యాలు కల్పించి, కేవలం ఒక్కరోజులోనే శ్రీవారి దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్న అధికారిని బదిలీ చేయాలి...సాంప్రదాయాలను పాటించకుండా...నిబంధనలను పట్టించుకోకుండా రాజకీయ, అధికార, అనధికార సిఫార్సులను చక్కపెట్టిన శ్రీనివాసరాజును అక్కడే కొనసాగించాలి. 'సాంబశివరావు' కేవలం రెండేళ్లు సర్వీసు పూర్తి చేయగా..శ్రీనివాసరాజు ఐదేళ్లకు పైగా బాధ్యతలు నిర్వహిస్తూనే ఉన్నారు. నిజాయితీకి, సమర్థతకు విలువ లేకుండా పోయింది. అవినీతికి పాల్పడేవారికి మద్దతు ఇస్తున్నారని టిటీడీ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..!


(500)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ