WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'అనుపమా'ను ఎందుకు వద్దంటున్నారు...?

ఇటీవల కాలంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న నటి 'అనుపమా పరమేశ్వరన్‌'. అటువంటి నటికి తెలుగు సినీపరిశ్రమ పిలిచి మరీ అవకాశాలు ఇస్తోంది. తాజాగా ఆమె 'సుకుమార్‌-రామ్‌చరణ్‌' సినిమాకు ఎంపికైంది. మరో హీరో 'నాని' సినిమాలో కూడా నటించబోతుందని వార్తలు వచ్చాయి. అయితే హఠాత్తుగా ఈ సినిమాల నుంచి 'అనుపమ'ను తప్పించేశారట. ఆమెను ఎందుకు తీసుకున్నారు...ఇప్పుడు ఎందుకు వద్దనుకుంటున్నారూ...అని   వివరాలు తెలుసుకుంటే ఆమె అడుగుతున్న పారితోషికమే దానికి కారణమట. 'అఆ', ప్రేమమ్‌, 'శతమానంభవతి' సినిమాలతో హ్యాట్రిక్‌ అందుకున్న 'పరమేశ్వరన్‌' తాజాగా తన రేటును అమాంతం పెంచేసిందట. 'శతమానంభవతి'కి రూ.24లక్షల రూపాయలు తీసుకున్న 'అనుపమ' 'సుకుమార్‌-రామ్‌చరణ్‌' సినిమాకు కోటి రూపాయలు అడిగిందట. దీంతో చిత్ర యూనిట్‌ ఆమెను వద్దనుకుని 'సమంత, రాశీఖన్నా'లను సంప్రదిస్తున్నారట. అయితే ఈ అవకాశాలు జారీపోయినా 'అనుపమ' బెదిరిపోవడం లేదు. తాను తిరస్కరణకు గురైన ప్రతిసారీ మరింతగా  అభివృద్ధి చెందానని...ఇటువంటి వాటికి కుంగిపోనని ట్విట్టర్‌లో తెలిపారు.


(627)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ