WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

పార్టీనేతలపై నిప్పులు కక్కిన 'చంద్రబాబు'...!

ఇటీవల కాలంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరుపై వస్తోన్న విమర్శలపై 'చంద్రబాబు' నిప్పులు కక్కారు. పేరు పేరున ఆయా నేతల ఆగడాలను ప్రస్తావిస్తూ ఆయన మండిపడ్డారు. విజయవాడలో బుధవారం నాడు నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన పలువురి నాయకులపై నిప్పులు చెరిగారు. పార్టీలో క్రమశిక్షణా రాహిత్యం పెరిగిపోతుందని, దీన్ని తాను సహించనని, విమర్శలు ఎదుర్కొంటున్న వారిపై వేటు వేస్తానని స్పష్టంగా ప్రకటించారు. 'చంద్రబాబు' ఆగ్రహాన్ని చూసిన నాయకులు ఎవరూ ఆయనకు ఎదురు మాట్లాడే సాహసం చేయలేదు. ముఖ్యంగా మంత్రి రావెల కిశోర్‌బాబు, మరో మంత్రి అచ్చెంనాయుడు వ్యవహారశైలిపై ఆయన తీవ్రంగా స్పందించారు. 

    వంశధార క్షేత్రస్థాయి పరిస్థితిని ఎందుకు అంచనా వేయలేకపోయారని ప్రశ్నించారు.ఈ విషయంలో పార్టీ నాయకత్వ తీరులో నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మీరు ఏం చేస్తున్నారని చంద్రబాబు నిలదీశారు.హింసాత్మక ఘటనలు జరిగితేగానీ తెలుసుకోలేకపోతున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.జీవో ఇస్తే ఇంత వరకు అమలు కాకపోవడం ఏమిటనీ ముఖ్యమంత్రి ప్రశ్నించారు.కడప జిల్లాలో ప్రాజెక్టులు పూర్తి అవుతుంటే శ్రీకాకుళం జిల్లాలో ఎందుకు పూర్తి కావని నిలదీశారు...పార్టీ క్రమశిక్షణ విషయంలో మంత్రి రావెల, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ జానీమూనీ వ్యవహారంపై వ్యక్తిగత విమర్శలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చినా 'రావెల'ను మంత్రిని చేశామని, పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించడం,పార్టీ నియామవళి తెలియదా? అని ఆయన ఘాటుగా అన్నారు. త్వరలోనే అన్ని నామినేటెడ్‌ పోస్టుల భర్తీ చేస్తామని, పార్టీపై పూర్తి స్థాయి దృష్టి పెడతానని ఆయన తెలిపారు.   

(565)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ