WWW.JANAMONLINE.COM

లేటెస్ట్

'జగన్‌' ఉచ్చులో 'పవన్‌'...!

ప్రత్యేక హోదా కోసం సోషల్‌ మీడియాలో ఎవరో...ఏదో పోస్టు చేశారు..దాన్ని  'పవన్‌' బ్యాచ్‌ అందుకుంది...! ఇంకేముంది...నాలుగు ట్విట్‌లు...ఆరు వార్తలు అన్నట్లు దుమ్మురేగిపోయింది...సోషల్‌ మీడియా...! యువత ప్రత్యేక హోదా కావాలంటున్నారు...'జల్లికట్టు' ఉద్యమ స్ఫూర్తితో మనం హోదాకోసం పోరాడదాం...అని 'జనసేన' అధినేత పిలుపునివ్వడం...'అరవవాళ్లు' సముద్రం ఒడ్డున చేశారు...కాబట్టి...మనకూ కావాల్సినంత సముద్రం ఉంది..కాబట్టి...ఛలో 'విశాఖ' అని పిలుపునిచ్చారు...సరే...'అరవాళ్లు' చేసినట్లే...మనమూ చేద్దాం..మనకు మైలేజ్‌ వస్తుందని భావించిన 'పవన్‌'కు ఇప్పుడు పచ్చివెలక్కాయ గొంతులో పడింది....! తాను ఒక్కడినే...విశాఖబీచ్‌లో...'జై...ఆంధ్రా'...అంటూ బట్టలు చింపుకుందామనుకుంటే...చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు....ఇప్పుడు 'జగన్‌' దూరుతున్నాడు...! యువత ఉద్యమానికి తానే ముందుంటానని... తనను ముందు అరెస్టు చేయాలని సవాళ్లు విసిరుతున్నాడు 'జగన్‌'. 

  నిన్న...మొన్నటి దాకా...ప్రత్యేకహోదా విషయంలో తాను ఎన్ని ఉద్యమాలు చేసినా 'జనం' నమ్మరని దాన్ని వదిలేసి 'దావోస్‌' గురించి  ఎకసెక్కాలు ఆడుతోంది 'జగన్‌' బ్యాచ్‌. ఇప్పుడు హఠాత్తుగా 'జనసేన' అధినేత సోషల్‌మీడియాలో నిర్వహిస్తున్న ప్రచారానికి 'జన' స్పందను గుర్తించిన 'జగన్‌' బ్యాచ్‌ హఠాత్తుగా 'విశాఖ' ఉద్యమాన్ని తనపై వేసుకుంది. మొదలు పెట్టిన వాళ్లు ఎటుపొయ్యారో...ఎవరికీ తెలియదు...మధ్యలో అందుకున్న 'పవన్‌' వస్తారో...రారో తెలియదు...కానీ 'జగన్‌'కు మాత్రం రాజకీయంగా బాగానే కలిసి వచ్చింది. రేపు విశాఖలో నిర్వహించే సభలో 'జగన్‌, పవన్‌ కలసి  ప్రసంగిస్తారా...? లేక ఎవరికి వారు...ఎవరి ఉద్యమం వారు చేసుకుని ఇంటికి వెళ్లిపోతారా...? ఇప్పుడు ఇదే ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.  అసలు పోలీసులు ఈ సభకు అనుమతి లేదని...ఇక్కడ ఎవరినీ గుమికూడనీయమని చెబుతోంది కానీ...ప్రజల నుంచి వస్తోన్న వత్తిడితో ప్రభుత్వం తగ్గి సభకు అనుమతి ఇవ్వవచ్చు. అదే జరిగితే...వీరిద్దరూ కలసి సభను నిర్వహిస్తారా...? ఒక వేళ ఇద్దరూ కలిస్తే మాత్రం అది పెను సంచలనమే...! 

  నిన్న మొన్నటి దాకా... ప్రత్యేక హోదా కోసం 'పవన్‌' కేంద్ర ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఈగ వాలనివ్వడం లేదు. కేంద్రం పాచిపోయిన లడ్డూలు ఇచ్చిందని...ఇది మోసమని ఆయన విమర్శిస్తున్నారు. ఇప్పటికే ఈ అంశంపై ఆయన సభలు నిర్వహించి ఆంధ్రాకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇది 'జగన్‌' వైఖరికి భిన్నం. ప్రత్యేక హోదాపై 'చంద్రబాబు' రాజీపడ్డారని...తనపై 'మోడీ' కేసులు పెడతారన్న భయంతో ఆయన 'హోదా' గురించి మాట్లాడడం లేదనేది  ఇప్పటిదాకా 'జగన్‌ అండ్‌ కో' చేస్తోన్న విమర్శ. అదే సమయంలో కేంద్రంలోని 'మోడీ' ప్రభుత్వాన్ని పన్నెత్తి విమర్శ చేయడం లేదు 'జగన్‌'. దానికి ఆయన కావాల్సిన కారణాలు ఆయనకు ఉన్నాయి మరి. 'షంద్రబాబు' వల్లే ప్రత్యేక హోదా ఆంధ్రాకు రావడం లేదనే 'జగన్‌'కు, 'మోడీ' ఇవ్వనందునే 'హోదా' రాదంటున్న 'పవన్‌'కు సఖ్యత కుదురుతుందా...? ఇదంతా పక్కన పెట్టినా... తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు అవినీతికి పాల్పడి అరెస్టు అయి 18 నెలలు జైలులో ఉన్న 'జగన్‌' పక్కన ఎటువంటి అవినీతి మరకలు లేని 'పవన్‌' కూర్చుంటే...ఎటువంటి సంకేతాలు ప్రజల్లోకి వెళతాయన్న ప్రశ్నకు 'పవన్‌' అభిమానుల నుంచి వస్తోంది. రాజకీయంగా ఎదగాలని కలలు కంటున్న 'పవన్‌' తన పోటీదారుడైన వ్యక్తితో కలసి ఒక వేదికపై కనిపిస్తారా...? ఏది ఏమైనా...ఇప్పుడు 'పవన్‌' కనుక 'జగన్‌'తో కలసి వేదిక పంచుకుంటే 'జగన్‌' పన్నిన 'ఉచ్చు'లో 'పవన్‌' చిక్కనట్లేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


(888)
  • (0)
  • -
  • (0)

అభిప్రాయాలూ